• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కాలాకు థాంక్స్ చెబుతున్న...

కాలాకు థాంక్స్ చెబుతున్న భరత్

By - Tupaki Desk
Update: 2018-04-11 11:13 GMT
ఏప్రిల్ 27 రావాల్సిన కాలా రేస్ నుంచి అఫీషియల్ గా తప్పుకుంది. ఈ మేరకు నిర్మాత ధనుష్ ప్రకటన కూడా చేసాడు. ఇది రజని ఫాన్స్ కు నిరాశ కలిగించవచ్చు కాని మహేష్ అభిమానులకు మాత్రం పండగ లాంటి వార్తే. ఎందుకంటే అదే తేదికి వస్తుంటే కనక భరత్ అనే నేనుకి కాలాకు కేవలం వారం మాత్రమే వ్యవధి ఉండేది. తెలుగు రాష్ట్రాల్లో కాకపోయినా తమిళనాడులో పూర్తిగా మిగిలిన రాష్ట్రాల్లో పాక్షికంగా కాలా భరత్ ని కలెక్షన్ పరంగా డ్యామేజ్ చేసేవాడన్నది నిజం. ఇది ముందే తెలిసినా వేరే ఆప్షన్ లేదు కనక గతంలోనే సై అంటే సై అంటూ రజనితో పోటీకి దిగారు బన్నీ అండ్ మహేష్. కాలా వచ్చిన వారానికే అల్లు అర్జున్ నా పేరు సూర్య వస్తుంది కాబట్టి ఆ రకంగానూ ఇబ్బంది కలిగించే విషయమే. అందుకే కాలా వాయిదా అన్ని రకాలుగా టాలీవుడ్ కు మేలు చేసేదే.

ఇప్పుడు భరత్ అనే నేను గ్రౌండ్ లో బలమైన ప్లేయర్ ఎవరు లేరు. నా పేరు సూర్యకు  రెండు వారాల గ్యాప్ ఉంటుంది కాబట్టి ఐపిఎల్ తరహాలో దుమ్ము దులపడమే మహేష్ చేయాల్సిన పని. ఇప్పటికీ భారీ ఎత్తున విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా ఓవర్సీస్ లో సైతం వారం తర్వాత కూడా భారీ సంఖ్యలో థియేటర్లు భరత్ కోసం కంటిన్యూ కాబోతున్నాయి. తమిళనాడులో సమ్మె ఇంకా పూర్తిగా కొలిక్కి రాని నేపధ్యంలో కాలా పోస్ట్ పోన్ చేయక తప్పలేదు. ఏకంగా జూన్ కు వెళ్ళవచ్చు అని కోలీవుడ్ టాక్. అదే కనక జరిగితే సమ్మర్ లో కీలకమైన సీజన్ రజని కోల్పోయినట్టే. అయినా చేయగలిగింది ఏమి లేదు కాబట్టి ఇప్పుడు భరత్ ఈ అవకాశాన్ని పూర్తిగా వాడుకోవాలి. రంగస్థలం సెట్ చేసిన రికార్డ్స్ టార్గెట్ పెట్టిన మహేష్ ఫాన్స్ ట్రైలర్ చూసాక అది జరుగుతుందనే ధీమాలో ఉన్నారు. ఇంకా 9 రోజులే టైం ఉండటంతో ఇవి ఎప్పుడెప్పుడు గడుస్తాయా అని ఎదురు చూస్తున్నారు.
Tags:    
  • Mahesh babu 
  • Bharat Ane Nenu Movie 
  • Rajinikanth Kaala 

Similar News

ENE Repeat Trailer: పర్ఫెక్ట్ కట్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS