• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అన్నపూర్ణ స్టూడియోలో...

అన్నపూర్ణ స్టూడియోలో అసెంబ్లీ

By - Tupaki Desk
Update: 2017-09-20 06:08 GMT
తెలుగు తెరపై సీఎంలు కనిపించి చాలా రోజులైపోయింది. అంటే ముఖ్యమంత్రులు సినిమాల్లో నటించారని కాదు.. ముఖ్యమంత్రి పాత్రలో హీరోలు ఈ మధ్య కనిపించలేదని.. అప్పుడెప్పుడో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ వన్ డే సీఎం పాత్రలో కనిపించి హడావుడి చేసి అదరగొట్టాడు. టాలీవుడ్ కండల వీరుడు రానా తొలి చిత్రంలోనే సీఎం పాత్రలో నటించాడు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లీడర్ సినిమాలో యంగ్ సీఎంగా కనిపించాడు.

చాలా సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి పాత్ర హీరోగా సినిమా వస్తోంది. ప్రిన్స్ మహేష్ బాబు సీఎం పాత్రలో కనిపించి అభిమాలకు ఆనందం పంచబోతున్నాడు. కొరటాల శివ డైరెక్షన్ లో భరత్ అనే నేను సినిమాలో మహేష్ పొలిటికల్ లీడర్ గా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. అన్నపూర్ణ స్టూడియో పెద్ద అసెంబ్లీ సెట్ కూడా వేశారు. ఎమ్మెల్యేలు.. వాళ్ల వెనుక అనుచరులు.. వాళ్ల జేజేలతో షూటింగ్ స్పాట్ హోరెత్తిపోతోంది. రాజకీయ నాయకులంటేనే ఖద్దరు చొక్కాలు.. మెళ్లో కండువాలు కామన్ కాబట్టి షూటింగ్ స్పాట్ లో చాలామంది అదే వేషాల్లో తిరిగేస్తున్నారు. ఓ రకంగా అన్నపూర్ణ స్టూడియో అంతా విపరీతమైన రాజకీయ ఆర్భాటం కనిపిస్తోంది.

భరత్ అనే నేను  సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులైనా ఇంతవరకు మహేష్ బాబు స్పైడర్ షూటింగ్ పనుల్లో బిజీగా ఉండిపోయాడు.  స్పైడర్ చిత్రీకరణ పనులన్నీ పూర్తయి విడుదలకు రెడీగా ఉంది. కాబట్టి మహేష్ బాబు ఇకపై ఫుల్ టైం భరత్ అనే నేను సినిమాకే కేటాయించనున్నాడు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తోంది.
Tags:    
  • Mahesh babu 
  • Assembly 
  • Annapurna Studio 
  • Telugu News 
  • Telugu Cinema NeWS 
  • Tollywood 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS