• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ బాబు లక్ష్మి నరసింహ...

మహేష్ బాబు లక్ష్మి నరసింహ స్వామి..!

By - Tupaki Desk
Update: 2021-10-04 23:30 GMT
సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రీకరణ చకచక జరుగుతోంది. స్పెయిన్ లో సినిమా షూటింగ్ కోసం యూనిట్ సభ్యులు అంతా కూడా అక్కడకు వెళ్లారు. మహేష్ బాబు కుటుంబ సభ్యులతో సహా అక్కడకు వెళ్లడం జరిగింది. షూటింగ్‌ ప్రారంభించిన కొన్ని రోజులకు నమ్రత మరియు పిల్లలు కలిసి స్పెయిన్ వెళ్లారు అంటూ సమాచారం అందుతోంది. మహేష్‌ బాబు మరియు కీర్తి సురేష్‌ లు జంటగా నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రం షూటింగ్‌ ను ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల ఆరంభంకు పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. పెద్ద ఎత్తున అంచనాలున్న సర్కారు వారి సినిమా లోని కీలకమైన ఇంటర్వెల్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇంటర్వెల్‌ కు ముందు సన్నివేశంలో విలన్ కు హీరో మహేష్ బాబు లక్ష్మి నరసింహ స్వామి గా కనిపిస్తాడట. యాక్షన్‌ సన్నివేశంలో భాగంగా మహేష్‌ బాబు కొన్ని నిమిషాలు ఆ గెటప్ లో కూడా కనిపించబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది.

మహేష్ బాబు ప్రతి సినిమాలో కూడా రెగ్యులర్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఎప్పుడు కూడా మహేష్‌ బాబు చాలా కూల్‌ లుక్ లో కనిపిస్తూ ఉంటాడు. సర్కారు వారి పాట కోసం కాస్త గెటప్ మార్చాడు. ఆ గెటప్ కు సంబంధించిన లుక్‌ ఇప్పటికే రివీల్ అయ్యింది. అంతకు మించి అన్నట్లుగా లక్ష్మి నరసింహ స్వామి గెటప్ లో కనిపించబోతున్నట్లుగా వస్తునన్ వార్తలు సినిమా పై అంచనాలను ఆకాశానికి లేపుతున్నాయి. ఇప్పటి వరకు స్టార్‌ హీరోల్లో కొద్ది మంది మాత్రం అలాంటి గెటప్స్ లో కనిపించారు. మహేష్ బాబును కొన్ని నిమిషాల పాటు ఆ గెటప్ లో చూడబోతున్న ఫ్యాన్స్ అభిప్రాయం ఏంటీ అనేది ఆసక్తిగా ఉంది. కొన్ని సార్లు ఇలాంటి జిమ్మిక్కులు సూపర్‌ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు మాత్రం నిరాశ పర్చే అవకాశం కూడా ఉంటుంది.

సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు కనిపించబోతున్న లుక్ విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా ఈ సినిమా ఒక మంచి ఎంటర్‌ టైనర్‌ గా నిలుస్తుందనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కీర్తి సురేష్ లుక్ మరియు మహేష్ బాబు టైమింగ్‌ కు తోడు దర్శకుడు పరశురామ్‌ ఒక మంచి ఫన్ ను క్రియేట్‌ చేస్తాడని నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. యాక్షన్‌ సన్నివేశాలు మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ మెచ్చే సన్నివేశాలు ఇంకా పాటలు అన్ని కలిపి ఫుల్ మీల్స్ గా సర్కారు వారి పాట ఉంటుందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను బాక్సాఫీస్ వద్దకు తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నారు. రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను ఈ సినిమా అందుకుంటుందా అనేది చూడాలి. సంక్రాంతికి వారం ముందు ఆర్ ఆర్‌ ఆర్ ను విడుదల చేస్తున్నారు. కనుక సర్కారు వారి పాట విడుదల విషయంలో ఏమైనా మార్పు ఉంటుందా అనేది చూడాలి. ఇప్పటి వరకు అయితే సర్కారు వారి పాట చిత్రం సంక్రాంతి బరిలోనే ఉంది.
Tags:    
  • Parashuram 
  • Mahesh Babu 
  • Keerthi Suresh 
  • Sarkaru Vaari Paata 
  • Tollywood 
  • Movie News 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS