మహేష్ శాటిలైట్ రైట్స్ ఇంకా ఇవ్వలే

Update: 2016-12-03 17:30 GMT
మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న 23వ చిత్రం.. మురుగ దాస్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ మూవీ  ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటి. సాధారణంగా మహేష్ సినిమా అంటేనే ట్రేడ్ వర్గాల్లో బోలెడంత ఆసక్తి ఉంటుంది. అలాంటిది మురుగదాస్ తో కాంబినేషన్ అంటే.. ఇంకెంత బిజినెస్ జరగాలి?

దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీకి.. ఇంకా థియేట్రికల్ రైట్స్ బిజినెస్ ఊపుందుకోలేదు కానీ.. శాటిలైట్ విషయంలో మాత్రం మాటలు జరుగుతున్నాయట. తెలుగు వెర్షన్ కోసం కనీసం 14 కోట్లు.. తెలుగు-తమిళ్ లకు కలిపి అయితే 23 కోట్లు కోట్ చేస్తున్నారట. కానీ బ్రహ్మోత్సవం మూవీ రిజల్ట్ కారణంగాను.. ఆ సినిమాకి టీవీల్లో వచ్చిన అతి తక్కువ టీఆర్పీల కారణంగా.. ఇంత రేటుతో కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. బ్రహ్మోత్సవంను కొనుగోలు చేసిన ఛానల్ కూడా.. ఇప్పుడు వెనక్కు తగ్గుతుండడంతో.. మరో పేరు మోసిన ఛానల్ కు ప్రతిపాదనలు పంపినట్లు చెబుతున్నారు.

అయితే 26కోట్లకు మహేష్-మురుగదాస్ ల సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయని ఇప్పటికే వార్తలు రావడం వెనక కూడా నిర్మాతల వ్యూహం ఉందని తెలుస్తోంది. డిమాండ్ పెంచుకోవడం కోసం అసలు శాటిలైట్ హక్కులు అమ్ముడుపోకపోయినా.. కంప్లీట్ అయిపోయినట్లుగా ఫీలర్లు వదిలారని చెప్పుకుంటున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News