• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సితార ఇంగ్లిష్ మూవీస్ లో...

సితార ఇంగ్లిష్ మూవీస్ లో చేస్తుందట: మహేశ్ బాబు

By - Tupaki Desk
Update: 2021-09-25 08:30 GMT
మహేశ్ బాబు ఒక సినిమాను ఒప్పుకున్నాడంటే ఆ సినిమాను ఆయన ఒక తపస్సులా భావిస్తాడు .. ఒక యజ్ఞంలా పూర్తి చేస్తాడు. తన వైపు నుంచి ఎలాంటి ఆలస్యం కాకుండా చూసుకుంటాడు. సినిమా షూటింగు మొదలుపెట్టిన దగ్గర నుంచి, ఆ సినిమా థియేటర్లకు వెళ్లే వరకూ ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారం జరిగేలా చూసుకుంటాడు. ఎక్కడా ప్లానింగులో తేడా రాకూడదనే విషయాన్ని ఆయన ముందుగానే దర్శక నిర్మాతలకు చెబుతాడు. ఎందుకంటే ఒక సినిమా ఏ కారణంగానైనా ఆలస్యమైతే, ఆ తరువాత సినిమా షూటింగుపై అది ప్రభావం చూపుతుంది.

ఇక సినిమా షూటింగుకు కొన్ని రోజుల పాటు విరామం ఇచ్చినా, ఒక సినిమా పూర్తయి మరో సినిమా షూటింగు మొదలుపెట్టడానికి మధ్య ఎక్కువ గ్యాప్ ఉన్నా వెంటనే ఆయన ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటాడు. ఫ్యామిలీతో విదేశాలకి వెళ్లి సరదాగా గడిపేసి వస్తుంటాడు. అలాగే తన ఫ్యామిలీకి సంబంధించిన సందడిని  సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. ఎక్కువగా ఆయన కూతురు సితార ఆటపాటలు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. మహేశ్ శ్రీమతి నమ్రత ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూనే ఉంటుంది.  

మహేశ్ తనయుడు గౌతమ్ .. తండ్రితో కలిసి '1 నేనొక్కడినే' సినిమాలో నటించాడు. ఇక సితార ఇటీవల ఒక యానిమేషన్ ఫిల్మ్ కి డబ్బింగ్ చెప్పింది. సితారతో కలిసి నటించాలనే ముచ్చట ఏదైనా ఉందా? సితారను సినిమాల్లోకి తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉందా? అనే ప్రశ్నలకు తాజాగా మహేశ్ బాబు సమాధానాలు చెప్పవలసి వచ్చింది. "సితారతో కలిసి నటించాలంటే నాకు కొంచెం నెర్వస్ గా ఉంటుంది. అయినా  తాను తెలుగు సినిమాలు చేయదట .. ఇంగ్లిష్ మూవీస్ చేస్తుందట' అంటూ మహేశ్ బాబు నవ్వేశాడు.  

అయినా ఇలా చేయండి .. అలా చేయండి అని నా అభిప్రాయాలను వాళ్లపై రుద్దే ప్రయత్నాలు చేయను. వాళ్లకి ఏది ఇష్టమో ఆ వైపు వెళ్లడానికి ప్రోత్సహిస్తాను. ఒకవేళ వాళ్లు సినిమాల వైపుకు వస్తానని చెప్పినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వాళ్లు ఏది అనుకుంటే అదే" అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' చేస్తున్న మహేశ్ బాబు, సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఆ తరువాత త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడో సినిమా చేయనున్నాడు. ఇక రాజమౌళితో చేయాలనే ఆయన చిరకాల కోరిక కూడా త్వరలో నెరవేరనుంది.    
Tags:    
  • Sitara 
  • Sitara Ghattamaneni 
  • Sitara Photoshoot 
  • Mahesh babu 
  • Sitara Age 
  • Namratha 
  • Sitara Latest Photos 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS