• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగాస్టార్ మూవీ కోసం...

మెగాస్టార్ మూవీ కోసం మణిశర్మ కొడుకు..!

By - Tupaki Desk
Update: 2021-08-28 09:32 GMT
మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు మెహర్ రమేష్‌ కాంబినేషన్ లో ''భోళా శంకర్'' అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఇది తమిళ్ లో అజిత్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ ‘వేదాళం’ చిత్రానికి అధికారిక రీమేక్‌. తెలుగులో చిరు సోదరిగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కనిపించనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.

దర్శకుడు మెహర్ రమేష్ ప్రస్తుతం ప్రధాన తారాగణం సాంకేతిక నిపుణులను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ''భోళా శంకర్'' చిత్రానికి సంగీతం ఎవరు అందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే విడుదలైన టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోకి అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అభిమానులను ఆకట్టుకుంది. దీంతో ఆ బీజీఎమ్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే ఆరాలు తీయడం మొదలు పెట్టారు. అయితే ఆ నేపథ్య సంగీతం ఇచ్చింది  సంగీత బ్రహ్మ మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్‌ అని తెలుస్తోంది.

'ఛలో' 'భీష్మ' 'అశ్వద్ధామ' 'ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ' 'మాస్ట్రో' వంటి చిత్రాలకు సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించిన మహతి స్వర సాగర్‌.. బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. మణి వర్క్ చేసే సినిమాలన్నింటికీ కొడుకు మహతి సహకారం కూడా ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు చిరంజీవి 'భోళా శంకర్' చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడని తెలుస్తోంది.

మెగాస్టార్ - మణిశర్మ కాంబోలో ఎన్నో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఉన్నాయి. ప్రస్తుతం చిరు నటిస్తున్న 'ఆచార్య' చిత్రానికి కూడా మణి శర్మ బాణీలు సమకూరుస్తున్నారు. ఇప్పుడు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ రూపొందనున్న చిరంజీవి చిత్రానికి ఆయన కుమారుడు మహతి సంగీతం ఎలా ఉండబోతుందో చూడాలని అభిమానులు ఆతృతగా ఉన్నారు. ''భోళా శంకర్'' చిత్రాన్ని ఏకే ఎంటర్టైనెంట్స్ - క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.
Tags:    
  • Bhola Shankar 
  • Bhola Shankar movie 
  • Chiranjeevi Bhola Shankar 
  • Mehar Ramesh Bhola Shankar 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS