మహర్షి సౌండ్ ఆగిపోయిందే

Update: 2019-05-25 06:22 GMT
మొన్నటి దాకా విపరీతమైన హడావిడి చేసిన మహర్షి టీమ్ ఉన్నట్టుండి గప్ చుప్ అయిపోయింది. మహేష్ బాబు ఫ్యామిలీ తో ఫారిన్ ట్రిప్ వెళ్లడం ఆలస్యం ఇక్కడ నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. మొన్నేదో రైతులకు సన్మానం అంటూ ఉలవచారు హోటల్ లో చిన్న ప్రోగ్రాం చేశారు కానీ అదంత మైలేజ్ ఇవ్వలేకపోయింది. హీరో లేకుండా ఈవెంట్లు చేస్తే అంతగా ప్రభావం చూపవు కనక టీమ్ కూడా ఆ విషయాన్ని లైట్ తీసుకుంది.

మహేష్ ఇండియా వదిలే నాటికి మహర్షి సుమారు 85 కోట్ల షేర్ కు దగ్గరలో ఉంది. అప్పటికే వీక్ డేస్ లో చెప్పుకోదగ్గ డ్రాప్ తో వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. ఓవర్సీస్ తో పాటు సీడెడ్ లాంటి కొన్ని ప్రాంతాల్లో నష్టాలు ఖాయమని తేలిపోయింది. ఒక్క నైజాం మాత్రమే మంచి లాభాలు కళ్లజూసిందనే రిపోర్ట్స్ వచ్చాయి. జరిగిన థియేట్రికల్ బిజినెస్ 95 కోట్లు షేర్ రూపంలో వచ్చిందా లేదా అనే స్పష్టత టీమ్ ఇవ్వడం లేదు. మొన్నటిదాకా ఎపిక్ బ్లాక్ బస్టర్ అంటూ మహేష్ కెరీర్ బెస్ట్ వారంలోనే దాటేసింది అంటూ ఊదరగొట్టిన టీమ్ కనీసం భరత్ అనే నేనుని క్రాస్ చేసినట్టు అయినా ప్రూవ్ చేయాలి.

ఇప్పుడా బాలన్స్ పది కోట్లు వచ్చినట్టు చూపిస్తేనే మహర్షి సేఫ్ వెంచర్ గా నిలుస్తుంది. అలా జరగకపోతే ఒక్కడు పోకిరి శ్రీమంతుడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ కి క్రాస్ చేసిందని చెప్పుకున్న మాటలు అబద్దమని తేలిపోతుంది. సో ఫైనల్ రన్ ఎంత లేదన్నా ఇంకో రెండు వారాలు పైనే వస్తుంది కాబట్టి టార్గెట్ రీచ్ అవుతామన్న నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఇంతా చేసి నెల రోజులు పూర్తి చేసుకునే జూన్ 9 నాటికే మహర్షి కథ ముగిసిపోయేలా ఉంది

    

Tags:    

Similar News