• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫిలింఫేర్ లో మ‌హాన‌టి...

ఫిలింఫేర్ లో మ‌హాన‌టి ఉత్స‌వం

By - Tupaki Desk
Update: 2019-12-23 03:50 GMT
మ‌హాన‌టి టీమ్‌ కు ఇదొక ప్రౌడ్ మూవ్ మెంట్‌. 66వ ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్స్-2019 చెన్నైలో అట్ట‌హాసంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో తెలుగు- త‌మిళ‌- మ‌ల‌యాళ‌- క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌ కు చెందిన బిగ్ సెల‌బ్రిటీస్ పాల్గొన్నారు. తార‌ళ త‌ళుకుల మ‌ధ్య జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి యంగ్ హీరో సందీప్ కిష‌న్‌-రెజీనా క‌సాండ్ర హోస్ట్ లుగా వ్య‌వహ‌రించారు. ఈ అవార్డుల్లో ప‌లు చిత్రాలు అవార్డుల‌కు పోటీపడ్డాయి.  రంగ‌స్థ‌లం- మ‌హాన‌టి చిత్రాల‌కు అగ్ర తాంబూలం ద‌క్కింది. ముఖ్యంగా బ్లాక్ బ‌స్ట‌ర్ `మ‌హాన‌టి` చిత్రానికి ఏకంగా నాలుగు పుర‌స్కారాలు ద‌క్కాయి.

ఉత్త‌మ చిత్రం అవార్డ్ తో పాటు.. ఉత్త‌మ న‌టిగా కీర్తి సురేష్‌- ఉత్త‌మ ద‌ర్శ‌కుడుగా నాగ్ అశ్విన్‌- క్రిటిక్స్ ఉత్త‌మ న‌టుడుగా దుల్క‌ర్ స‌ల్మాన్ అవార్డుల్ని సొంతం చేసుకున్నారు. ఈ అవార్డు వేడుక‌లో పుర‌స్కారాల్ని అందుకున్న నిర్మాత‌లు ప్రియాంక ద‌త్‌- స్వ‌ప్నాద‌త్‌- ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ షీల్డ్స్ ప‌ట్టుకుని గ‌ర్వం తో దిగిన ఫొటో సోష‌ల్ మీడియా లో వైర‌ల్ అవుతోంది. సినిమా ప్రారంభం లో ఎన్ని విమ‌ర్శ‌లు ఎదురైనా స‌క్సెస్‌ పై గ‌ట్టి న‌మ్మ‌కం తో ప‌నిచేశారు. ఆ న‌మ్మ‌కానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్క‌డంతో ఆ విజ‌య గ‌ర్వం వారి ముఖాల్లో స్ప‌ష్టం గా క‌నిపించ‌డం ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది.

జాతీయ పుర‌స్క‌రాల్లో `మ‌హాన‌టి` చిత్రానికి మూడు విభాగాల్లో పుర‌స్కారాలు ల‌భించాయి. దాంతో టాలీవుడ్ గ‌ర్వంగా ఫీలైంది. తాజాగా ఫిల్మ్ ఫేర్ లో నాలుగు అవార్డులు ద‌క్క‌డంతో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల ఆనందానికి అవ‌ధుల్లేవ్. వైజ‌యంతి కి అనుబంధంగా త్రీ ఏంజెల్స్ బ్యాన‌ర్ స్థాపించిన స్వ‌ప్ప‌ద‌త్- ప్రియాంక ద‌త్ .. త‌మ కెరీర్ బెస్ట్ హిట్ ని మ‌హాన‌టి రూపం లో అందుకున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    
  • Mahanati 
  • Mahanati Awards 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Telugu Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS