• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘మా’ ఎన్నికలు: లాభమెంత?...

‘మా’ ఎన్నికలు: లాభమెంత? నష్టమెంత?

By - Tupaki Desk
Update: 2019-03-09 06:33 GMT
సినిమాల్లో కలిసి నటిస్తారు.. సమాజానికి హితబోధ చేస్తారు.. తీరా తమదాకా వస్తే మాత్రం పదవుల కోసం కొట్టుకుంటారు.. మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్(మా)లో అంతా మంచోళ్లే.. మరి ఎందుకీ గొడవలు.? ఎందుకీ ఆధిపత్య పోరు.. సేవ చేయడంలో ఎందుకీ ఈగోలు.. స్టార్ హీరోలను సైతం కలుస్తూ వారు బహిరంగంగా ఎవ్వరికీ మద్దతు ఇవ్వలేని పరిస్థితులు కల్పిస్తూ.. ఆదిపత్య పోరుతో ఆగమవుతున్నారు. టాలీవుడ్ పేరునే చెడగొడుతున్నారన్న ఆవేదన సినీ పరిశ్రమలో నెలకొంది. ఇంతకీ ‘‘మా’’ ఎన్నికలు ఎవరి లాభం.. ఎవరికి నష్టం.?

*సేవలో ఈ కొట్లాట ఎందుకు?

టాలీవుడ్ కు కేంద్రమైన మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ (మా)లో గొడవలు ముదిరిపాకాన పడ్డాయి. టీవీల కెక్కి టాలీవుడ్ పరువును బజారుకీడుస్తున్నారన్న ఆవేదన సినీ ప్రముఖుల్లో నెలకొంది. నిజానికి మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ లో గడిచిన సారి శివాజీ-నరేష్ ద్వయం మంచి పనులు చేసింది. సేవతో సినీ జనాలను ఆకట్టుకుంది. కానీ ఎక్కడొచ్చిందో కానీ తిరకాసు ఒకరిపై ఒకరు విమర్శలు - ప్రతివిమర్శలు రచ్చకెక్కారు. పెద్దల హెచ్చరికలతో వెనక్కి తగ్గారు. డబ్బులు, ఈవెంట్ల ప్రధానంగా సాగిన ఈ సేవా నిరతిలో ఎవరికి వారు క్రెడిట్ కోసం పరితపించి పక్కోళ్లు అవినీతి చేశారంటూ తిట్టుకున్నారు. టాలీవుడ్ లో అవకాశాలు దక్కక.. రోజువారీ తిండికి కూడా కష్టపడుతున్న కళాకారులు ఎందరో ఉన్నారు.. వారిందరికీ భరోసా ఇవ్వాల్సిన శివాజీ-నరేష్ లు కొంత వరకూ సఫలీకృతం అయ్యారు. కానీ ఇప్పుడు విడిపోయి సంఘాన్ని మొదటికి తీసుకొచ్చారు. మాకు నిధుల కోసం చేసిన ఈవెంట్లతోనే గొడవలు మొదలయ్యాయి. సేవా చేయాలన్న సంకల్పం.. డబ్బులతో పక్కదారి పట్టి విమర్శలకు ఉసిగొల్పింది. కళాకారులకు సేవ చేయాల్సిన ప్రతినిధులు పైసల పేరుతో విడిపోయి రచ్చ చేసుకున్నారు. కలిసి కూర్చొని లెక్కలు తీసి అన్నార్థులకు ఖర్చు చేస్తే సరిపోయేదానికి రచ్చ కెక్కి రచ్చరచ్చ చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. నిజానికి శివాజీ కానీ, నరేష్ కానీ ఒపికతో మాలోని సమస్యలు పరిష్కరించుకుంటే టాలీవుడ్ కలకాలం కలిసికట్టుగా ఉంటుంది. కానీ  ఇప్పుడు ఎన్నికల పేరుతో రణరంగం సృస్టిస్తున్నారు. టీవీల్లో చర్చల పేరిట దుమ్మెత్తి పోసుకుంటున్నారు.  సేవా పరమార్థం అంటున్న ఈ సినీ పెద్దలు ఇప్పుడా ఆ సేవను పక్కకు పెట్టి మా పీఠం కోసం కొట్టుకుంటున్నారు. మంచిగా సాగుతున్న ‘మా’నావలో యుద్ధానికి దిగుతున్నారు. ఇన్నాల్లు చేసిన మంచిపని ఇప్పుడు ఎన్నికలతో పోగొట్టుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

*హీరోలనూ అభాసుపాలు చేస్తున్నారు...

‘మా’కు మూలపురుషులైన స్టార్ హీరోలు, సినీ ప్రముఖులను కలిసి మద్దతు తమకే అని చెప్పుకుంటున్న మా పోటీదారులు వారిని ఇరకాటంలో పడేస్తున్నారు. రేపొద్దున వైరివర్గం గెలిస్తే సదురు హీరోల పరపతి, ప్రతిష్ట మసకబారుతుంది. అందుకే అటు పెద్దలు కూడా ఈ రెండు గ్రూపుల కొట్లాటలో సమిధలవుతున్నారు. బహిరంగంగా ఈ వర్గానికి మద్దతు అని చెప్పలేకపోతున్నారు. వీరి కొట్లాట సినీ పెద్దలను కూడా ఇరకాటంలో పడేస్తోంది.

*నిధుల కోసమా.? నిబద్ధత కోసమా.?

ఆపదలో ఉన్న కళాకారులకు సేవ చేయడానికి... సినిమాల్లోని సమస్యలు పరిష్కరించడానికి తెలుగు సినిమా ప్రముఖులంతా కలిసి మూవీ ఆర్టిస్ట్ అసోయిేషన్ ఏర్పాటు చేసుకున్నారు. సేవే పరమార్థం అయిన ఈ సంఘం దానిపై దృష్టి సారిస్తే బావుంటుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ఆ సేవలో నిధుల గొడవ ఇరు వర్గాలను రచ్చకీడ్చింది. నిబద్ధత కోసం ఇరువర్గాలు పోట్లాడుకుంటున్నాయి. ఇందులో సేవ పక్కకుపోయి ఆధిపత్యం తెరమీదకొచ్చింది. నిబద్ధతను చాటుకోవడానికి వైరివర్గాలను అభాసుపాలు చేసేస్తున్నారు.. అంతిమంగా టాలీవుడ్ జనాల వ్యక్తిత్వాలకే ఇది దెబ్బ పడుతోంది.  ‘మా’ ప్రతిష్టను మసకబారుస్తోందన్న ఆవేదన జనాల్లో వ్యక్తమవుతోంది..

* ఇంతకీ సపోర్టు శివాజీకా,? నరేష్ కా?

టాలీవుడ్ లో ఇప్పుడు ఒకటే చర్చ. ఇంతకీ సినీ ప్రముఖుల మద్దతు శివాజీకా.. నరేష్ కా.. ఇద్దరూ మా కోసం తపన పడ్డవారే.. ఇద్దరూ సేవా కార్యక్రమాలతో ‘మా’ను ఎత్తుకు తీసుకెళ్లినవారే. ఇప్పుడు నిధుల విషయంలో వచ్చిన తేడా ఇద్దరినీ దూరం జరిపింది. మాట్లాడుకుంటే పోయేదానికి కత్తులు దూసుకునేలా చేసింది. పైసామే పరమార్తగా సాగుతున్న ఈ  సమాజంలో ‘మా’ కూడా ఇలా విడిపోవడంపై సినీ పెద్దలు మనస్తాపం చెందుతున్నారు. ఎవ్వరికీ మద్దతివ్వాలో తెలియక మిన్నకుండిపోతున్నారు. ఎవరో ఒకరికి మద్దతిచ్చినా మరొకరిని అవమానించినట్టవుతుంది. రేపు గెలిచాక కూడా ముఖం చూసుకోలేని పరిస్థితిని శివాజీ, నరేష్ లు క్రియేట్ చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదన్నది సినీ పెద్దల వాదన..

*అంతిమంగా పోయేది టాలీవుడ్ పరువే..

కళాకారులను ఆదుకునే విషయంలో పోటీపడండి.. వారి బాగోగుల కోసం పెద్ద కార్యక్రమాలు నిర్వహించడంలో పోటీపడండి.. కానీ మాపై ఆధిపత్యం కోసం రెండు చీలిపోవడంపై సినీ పెద్దలతోపాటు సామాన్య జనం కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ గొడవలను టీవీలో చూసి వీటివల్ల ఎవరికి ఉపయోగం అని జనం చర్చించుకుంటున్నారు.. టాలీవుడ్ పరువును బజారుకీడ్చడం తప్పితే దీనితో ఒరిగేదేమిటని అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో కొట్లాడుకుంటున్న వలే.. సినిమా సంఘాంలోనూ ఈ కొట్లాటలు చూసి సినీ అభిమానులు, జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. సేవ ముసుగులో తలపడుతున్న ఈరెండు గ్రూపుల వల్ల ఎవరికి లాభం.? ఎవరికి నష్టం అని ప్రశ్నిస్తున్నారు.
   

Tags:    
  • MAA Elections 
  • MAA Association Elections 
  • Maa 2019 Elections 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS