ల‌స్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్ ఇబ్బందుల్లో?

Update: 2020-12-10 04:58 GMT
సంచ‌ల‌నాల‌ నెట్ ‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు వెర్షన్ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ నిర్మాత రోనీ స్క్రూవాలా తెలుగు వెర్ష‌న్ ని నిర్మిస్తున్నారు. నాలుగు క‌థ‌ల సంక‌ల‌న‌మిది. నందిని రెడ్డి- సందీప్ రెడ్డి- సంకల్ప్ రెడ్డి- తరుణ్ భాస్కర్ నాలుగు విభాగాలకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

అయితే ఊహించ‌ని కొన్ని కారణాల వల్ల సందీప్ రెడ్డి ఈ సిరీస్ నుండి బయటకు వెళ్ళిపోయార‌ని తెలుస్తోంది. తాజా క‌థ‌నం ప్ర‌కారం.. సందీప్ రెడ్డి చేయాల్సిన పార్ట్ మిన‌హా.. మిగిలిన మూడు కథల షూటింగ్ పూర్తయింది.

నాలుగో కథను డైరెక్ట్ చేసేది ఎవ‌రు? అన్నది ఇప్ప‌టికి స‌స్పెన్స్. సందీప్ రెడ్డి స్థానంలో ద‌ర్శ‌కుడి కోసం మేకర్స్ ఇంకా వెతుకుతున్నారు. సంకల్ప్ చిత్రంలో ఈషా రెబ్బా నటించగా.. నందిని రెడ్డి చిత్రంలో అమలా పాల్ ప్రధాన పాత్రలో నటించారు.
Tags:    

Similar News