• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టీజర్ టాక్: లవర్.. అస్సలు...

టీజర్ టాక్: లవర్.. అస్సలు ఓవర్ గా లేదు

By - Tupaki Desk
Update: 2018-06-29 11:58 GMT
చాలారోజుల నుండి టాలీవుడ్ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కోసం ఎదురుచూస్తుంటే.. ఆ మధ్యన 'తొలిప్రేమ' అంటూ పలకరించాడు వరుణ్‌ తేజ్. ఆ తరువాత మరోసారి అటువంటి లవ్ స్టోరీ చూడ్డానికి జనాలు ఎదురుచూస్తున్నారని తెలుసుకుని.. ఇప్పుడు ''అలా ఎలా'' సినిమా డైరక్టర్ అనీష్‌ కృష్ణ కూడా అలాంటి కథా వస్తువుతోనే వచ్చాడు. సాక్షాత్తూ 'లవర్' అనేది ఆ సినిమా పేరు.

రాజ్ తరుణ్‌ హీరోగా.. కొత్తమ్మాయ్ రిద్ది కుమార్ హీరోయిన్గా.. అనీష్‌ కృష్ణ తీసిన లవర్ టీజర్ ఇప్పుడు విడుదలైంది. టీజర్లో చూస్తే మాత్రం.. ఇదో క్యూట్ లవ్ స్టోరి అని అర్దమైపోతోంది. ఒక సింపుల్ అమ్మాయిని రాజ్ తరుణ్‌ ప్రేమించి ప్రపోజ్ చేయడం.. ఆ ప్రపోజ్ చేసే టైములో కూడా తను చెప్పాలనుకున్నది పేపర్లో రాసుకొచ్చి.. అది ఓసారి చూసుకుని 'నా ప్రేమ విశ్వమంత.. నువ్వు తప్పించుకోలేవ్' అంటూ ఓ పాత డైలాగును భలే ఫన్నీగా చెప్పాడు హీరో. కొత్త పిల్ల కూడా హీరోయిన్ గా బాగుంది. ఇదొక రొమాంటిక్ కామెడీ ప్రేమ కథ అని అక్కడే అర్ధమవుతోంది.

ఇకపోతే ఈ సినిమా కోసం సమీర్ రెడ్డి అందించిన విజువల్స్ అదిరిపోయాయ్. కాని ఐదుగురు సంగీత దర్శకులు పాటలను అందించడం కారణంగా.. మరి బ్యాగ్రౌండ్ స్కోర్ ఎవరు ఇచ్చారనేది తెలియలేదు. కాకపోతే టీజర్లో మ్యూజిక్ అదిరింది. టీజర్ చివర్లో ఓ స్నేహితుడు ఈ లవర్ ను బాగా ఓవర్ గా ఉన్నాడంటూ కామెడీ చేస్తాడు కాని.. ఈ టీజర్ మాత్రం అస్సలు ఓవర్ గా లేదు. సింపుల్ గా అదిరిపోయింది.

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View
Tags:    
  • Lover Teaser 
  • Lover Movie Teaser 
  • Raj Tarun Lover TEaser 
  • Raj Tarun 
  • Lover Movie 
  • Lover Teaser 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS