అక్కినేని హీరో మూవీ రిలీజ్ డేట్ అందుకే అనౌన్స్ చేయడం లేదా..?
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య - నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''లవ్ స్టోరీ''. సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్ - పుష్కర్ రామ్మోహన్ రావ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో తిరిగి ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి చేశారు. అయితే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా విడుదలపై ఇంతవరకు స్పష్టత రాలేదు. ఇప్పుడిప్పుడే థియేటర్స్ రీ ఓపెన్ అవుతున్న నేపథ్యంలో సంక్రాంతి కానుకగా 'లవ్ స్టొరీ' చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉందని అనుకున్నారు. అయితే సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇంకా 'లవ్ స్టొరీ' విడుదల తేదీ ఫిక్స్ చేయలేదట.
'లవ్ స్టోరీ' చిత్రాన్ని మేకర్స్ సుమారు 35 కోట్ల ఖర్చు పెట్టి తీశారు. అంటే ఇప్పుడు ప్రాఫిట్ లో ఉండాలంటే అన్నీ రైట్స్ కలిపి 40 కోట్ల వరకు బిజినెస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ స్థాయిలో బిజినెస్ జరగడం లేదనే టాక్ వస్తోంది. శేఖర్ కమ్ముల సినిమాలంటేనే ఏ క్లాస్ సినిమా అని ఆడియన్స్ ఫిక్స్ అవుతుంటారు. 'ఫిదా' మూవీ కూడా సాయి పల్లవి మరియు మెగా ఫ్యాన్స్ కారణంగా ఎక్కువ వసూళ్లు రాబట్టిందనే టాక్ ఉంది. అందులోనూ సాయి పల్లవి డెబ్యూ మూవీ కావడంతో కుర్రకారు ఈ చిత్రాన్ని తెగ చూశారు. కానీ ఇప్పుడు సాయిపల్లవి అంటేనే జనాలకు బోర్ కొట్టిందనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. నాగ చైతన్య ఇంకా బీ సీ సెంటర్స్ లో సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టలేదు. ఈ నేపథ్యంలో 'లవ్ స్టొరీ' పరిస్థితి ఎలా ఉంటుందో అని ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు.