జక్కన్న ముందు చాలా సమస్యలు
రాజమౌళి ఏ సినిమా చేస్తున్నా కూడా దేశం మొత్తం తనవైపు తిరిగి చూసే విధంగా చేసుకున్నాడు. ఈగ.. బాహుబలి సినిమాలతో హిందీ దర్శకులను మించి స్టార్ డంను దక్కించుకున్న రాజమౌళి ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్స్ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. వీరిద్దరు అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీమ్ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కథ ఛారిత్రాత్మక నేపథ్యం అవ్వడంతో పాటు హీరోల పేర్లు చరిత్ర పురుషులు అయిన అల్లూరి మరియు కొమురం భీమ్ లు అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదే సమయంలో హీరోల పేర్లు అల్లూరి.. భీమ్ అని పెట్టి వారి కథను కాకుండా మరో రకంగా కథను మలుస్తున్న నేపథ్యంలో విమర్శలు మొదలయ్యాయి.
కొమురం భీమ్ పాత్రను పోషిస్తున్న ఎన్టీఆర్ ముస్లీంగా తెల్ల టోపీ పెట్టడంతో వివాదం రాజుకుంది. సినిమా కథ ఎలా ఉంటుందో ఎవరికి అవసరం లేదు. కొమురం భీమ్ అనే పాత్రను ముస్లీంగా చూపించేందుకు జక్కన్న ప్రయత్నిస్తున్నాడు అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. కొమురం భీమ్ తెలంగాణ గొండు బిడ్డ. ఆయన చరిత్రను వక్రీకరించి చూపిస్తే కొట్టి చంపేస్తాం.. థియేటర్లను బద్దలు కొడతాం అంటూ కొందరు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల నుండి రాజమౌళి ఎలా బయట పడతాడు అనేది చూడాలి.
ఇక ఈ సినిమా టైటిల్ అంటే ఆర్‌ఆర్‌ఆర్ అంటూ చెబుతున్నారు కాని జక్కన్న పెట్టిన 'రౌద్రం రణం రుధిరం' ను మాత్రం ఎవరు గుర్తించడం లేదు. అసలు ఈ టైటిల్ కూడా చాలా మందికి తెలియదు. చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఎక్కువ శాతం ఆర్‌ఆర్‌ఆర్ అంటూ ప్రచారం చేస్తున్నారు కాని అసలు టైటిల్ ను మాత్రం ఎక్కువగా చెప్పడం లేదు. దాంతో టైటిల్ విషయంలో కూడా విడుదల సమయంలో సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేదు అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొత్తానికి జక్కన్నకు గతంలో ఎప్పుడు లేని విధంగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ఎదుర్కోబోతున్నాడు. వాటిని ఎలా ఓవర్ కమ్ చేస్తాడు అనేది చూడాలి.