• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూపర్‌ స్టార్స్ వదలని...

సూపర్‌ స్టార్స్ వదలని దర్శకుడు

By - Tupaki Desk
Update: 2021-10-14 03:30 GMT
ఇండస్ట్రీలో ఒక్క సూపర్‌ హిట్ పడితే వరుసగా ఆఫర్లు వస్తూనే ఉంటాయి. అది కూడా ఒక్క సారి స్టార్‌ హీరోతో సినిమా సక్సెస్ చేస్తే ఆ దర్శకుడికి స్టార్స్ సూపర్ స్టార్స్ నుండి ఆఫర్లు వెళ్లువెత్తుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి తమిళ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్ కు ఉంది. తమిళ మీడియాలో వస్తున్న కథనాలను చూస్తుంటే అక్కడి స్టార్ హీరోలు ఇప్పుడు ఆయన్ను ఎంతగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. విజయ్ తో మాస్టర్ సినిమాను చేసిన తర్వాత అనూహ్యంగా లోకేష్‌ గ్రాఫ్‌ పెరిగి పోయింది. మాస్టర్ ఫలితం నేపథ్యంలో లోక నాయకుడు కమల్‌ హాసన్‌ స్వయంగా పిలిచి ఆఫర్‌ ఇచ్చాడు. ప్రస్తుతం కమల్‌ తో విక్రమ్‌ సినిమాను లోకేష్‌ కనగరాజ్‌ చేస్తున్నాడు. ఆ సినిమా లో కమల్‌ హాసన్‌ తో పాటు విజయ్ సేతుపతి మరియు మలయాళ స్టార్‌ ఫాహద్ ఫాజిల్‌ కూడా నటిస్తున్నారు.

విక్రమ్‌ సినిమా వచ్చే ఏడాది ఆరంభం వరకు ముగించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇటీవలే సినిమా షెడ్యూల్‌ ను ముగించినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం లోకేష్‌ కనగరాజ్‌ తో సినిమాను చేసేందుకు తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ చాలా ఆసక్తిగా ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. లోకేష్‌ ఎప్పుడు అంటే అప్పుడు రజినీకాంత్ రెడీ అన్నట్లుగా ఉన్నాడు అంటూ తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రజినీకాంత్‌ మాత్రమే కాకుండా అజిత్ మరియు సూర్యలు కూడా లోకేష్‌ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు అనేది సమాచారం. లోకేష్‌ కనగరాజ్‌ తదుపరి ఏ హీరోతో సినిమా చేస్తాడు అనేది సస్పెన్స్ గా ఉంది. కాని ఖచ్చితంగా కమల్‌ తర్వాత మరో సూపర్ స్టార్‌ తో సినిమా ఉంటుందని అంటున్నారు.

ఇప్పటికే పలువురి పేర్లు ప్రచారం అవ్వగా ఇప్పుడు కొత్తగా విజయ్ హీరోగా లోకేష్‌ కనగరాజ్ మూవీ అంటూ వార్తలు వస్తున్నాయి. మాస్టర్‌ కాంబో మళ్లీ రిపీట్‌ అంటూ తమిళ మీడియాలో గత రెండు రోజులుగా ప్రథానంగా కథనాలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున వస్తున్న ఈ కథనాలు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి. మాస్టర్ సినిమాను కరోనా సమయంలో ఓ రేంజ్ లో వసూళ్లు సాధించేలా తీశాడు అంటే లోకేష్‌ ప్రతిభ ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు. పాన్ ఇండియా గుర్తింపు దక్కించుకున్న లోకేష్ కనగరాజ్ తో విజయ్ మళ్లీ సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నాడని.. కాని ప్రస్తుతం కమిట్‌ అయిన మూడు సినిమా ల తర్వాత మాస్టర్ కాంబో రిపీట్‌ అవుతుందని అంటున్నారు.

రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు దక్కించుకున్న మాస్టర్ సినిమా కు సీక్వెల్‌ గా ఆ సినిమా ఉంటే మరింత మంచిగా ఉంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. మరి లోకేష్ ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తాడేమో చూడాలి. విజయ్  మరియు లోకేష్ ల కాంబో రిపీట్‌ వరకు వార్తలు వస్తున్నాయి కాని మాస్టర్ కు సీక్వెల్‌ అయ్యి ఉంటుందా అనేది మాత్రం స్పష్టత ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. విజయ్‌ ప్రస్తుతం బెస్ట్‌ సినిమా ను చేస్తున్నాడు. ఆ తర్వాత తెలుగు లో వంశీ పైడి పల్లి దర్శకత్వం లో ఒక సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యాడు. ఇక లోకేష్ కనగరాజ్ కూడా తన విక్రమ్‌ సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్‌ కు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్ వినిపిస్తుంది.
Tags:    
  • lokesh kanagaraj 
  • lokesh kanagaraj movies 
  • lokesh kanagaraj master 
  • lokesh kanagaraj vikram movie 
  • kamal hasan 
  • vijay 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS