• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లోకేష్ కనగరాజ్ ఇక నుండి...

లోకేష్ కనగరాజ్ ఇక నుండి ప్రతి సినిమాలో అదే తీరు...!

By - Tupaki Desk
Update: 2022-06-11 07:32 GMT
ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు ఉంటారు. వందల మంది దర్శకుల్లో కొద్ది మంది మాత్రం చాలా విభిన్నంగా కనిపిస్తూ ఉంటారు. వారి స్టైల్‌ యూనిక్ గా ఉండటంతో సినిమాలు సక్సెస్ అయినా ప్లాప్‌ అయినా కూడా జనాలు వారి సినిమాల గురించి.. వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కొన్ని సినిమాలు సక్సెస్ అయినా కూడా దర్శకుల గురించి పెద్ద చర్చ ఉండదు.

కాని ఇటీవల విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న 'విక్రమ్‌' సినిమా యొక్క దర్శకుడి గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. లోకేష్ కనగరాజ్... ఈ పేరు పాన్ ఇండియా రేంజ్ లో మారుమ్రోగుతోంది. రాజమౌళి మరియు ప్రశాంత్ నీల్ ల రేంజ్ లో లోకేష్‌ కనగరాజ్ గురించి మాట్లాడుకోవడం మనం వింటూనే ఉన్నాం.

హాలీవుడ్‌ మార్క్‌ స్క్రీన్ ప్లే మరియు పాత్రల కంటిన్యూషన్ ను లోకేష్ కనగరాజ్ ఇండియన్‌ సినీ ప్రేక్షకులకు చూపిస్తూ తనదైన శైలిలో సక్సెస్ లను దక్కించుకుంటున్నాడు. విక్రమ్‌ సినిమాలో తన గత చిత్రం ఖైదీ యొక్క పాత్రను ఇన్వాల్వ్ చేయడం ద్వారా ప్రేక్షకులను సర్‌ ప్రైజ్ చేసిన లోకేష్‌ కనగరాజ్ ముందు ముందు తాను చేయబోతున్న ప్రతి సినిమాలో కూడా ఇలాగే ప్రేక్షకులను సర్‌ ప్రైజ్ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

లోకేష్ తదుపరి సినిమా ను తమిళ సూపర్ స్టార్‌ విజయ్‌ తో చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత ఖైదీ 2 సినిమాను మొదలు పెట్టబోతున్నాడని తెలుస్తోంది. భవిష్యత్తులో విక్రమ్ సినిమాకు కూడా సీక్వెల్స్‌ ను తీయాలని భావిస్తున్నట్లుగా లోకేష్ కనగరాజ్‌ భావిస్తున్నాడు.

మొత్తానికి లోకేష్ ఇప్పటి వరకు చేసిన సినిమాలకు.. ఇక నుండి చేయబోతున్న ప్రతి సినిమాకు కూడా ఒకదానితో ఒకటి లింక్‌ ఉండేలా ప్లాన్‌ చేస్తున్నాడు. ఇలా కొన్ని హాలీవుడ్‌ సినిమాల్లో మాత్రమే చూస్తాం. తెలుగు లేదా ఇండియన్‌ సినిమా స్క్రీన్‌ పై ఇలాంటి కాన్సెప్ట్‌ తో సినిమాలు రాలేదు. తెలుగు లో కూడా లోకేష్ కనగరాజ్ సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నాడట.

లోకేష్‌ కనగరాజ్‌ తో టాలీవుడ్‌ ప్రముఖ స్టార్‌ హీరోలు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. విక్రమ్‌ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఏడాదికి రెండు సినిమాలకు తగ్గకుండా లోకేష్ సినిమాలు చేయాలని ప్లాన్‌ చేస్తున్నాడట.
Tags:    
  • LokeshKangaRaju 
  • Vikram 
  • KamalHassan 
  • VijaySethupathi 
  • Fahadfaisal 
  • Suriya 
  • Kaithi 
  • Karthik 
  • Industry 
  • PanIndianMovies 
  • Rajamouli 

Similar News

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

Copyright @2026

Powered by Blink CMS