• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'రాంచరణ్' తో మూవీ పై...

'రాంచరణ్' తో మూవీ పై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్!!

By - Tupaki Desk
Update: 2021-01-03 17:46 GMT
కోలీవుడ్ సంచలన డైరెక్టర్లలో యంగ్ టాలెంటెడ్ లోకేష్ కనగరాజ్ ఒకడు. లోకేష్ తీసిన రెండు సినిమాలు మానగరం, ఖైదీ రెండు కూడా విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు లోకేష్ తను తెరకెక్కించిన మూడో సినిమా మాస్టర్ విడుదల గురించి వెయిట్ చేస్తున్నాడు. Ee సినిమాలో ఇళయదళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించారు. ఇక లోకేష్ ప్రస్తుతం లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా విక్రమ్ అనే సినిమా రూపొందిస్తున్నాడు. అతని సినిమాల లైన్ అప్ చూస్తుంటే ప్రస్తుతం మార్కెట్ లో లోకేష్ పేరు బాగానే వినిపిస్తుంది. అంతేగాక డిమాండ్ కూడా ఎక్కువే అని చెప్పవచ్చు. అయితే తెలుగులో కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న  ఒక ప్రాజెక్ట్ లోకేష్ డైరెక్ట్ చేయనున్నట్లు ఓకే చేసాడు. కానీ అది ఏ సినిమా? ఎవరితో? అనేవి తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. లోకేష్ కనగరాజ్‌తో మెగాపవర్ స్టార్ రాంచరణ్ లేదా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చేస్తారని గతంలో పుకార్లు వచ్చాయి. అయితే ఇప్పుడిప్పుడే వాటి గురించి స్పష్టత రానుంది. తాజాగా లోకేష్ చెప్పిన దాని ప్రకారం.. అతను చాలామంది యాక్టర్లతో చర్చలు జరిపాడట. అందులో ఒకడు రాంచరణ్, అలాగే ఒక స్క్రిప్ట్ కూడా వివరించాడట. అయితే ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి ప్రాజెక్టులతో వారు బిజీగా ఉన్నారు. ఇక ఇద్దరూ కూడా ప్రస్తుత సినిమాలు కంప్లీట్ చేసి ఫ్రీ అయ్యాక ఫైనల్ స్క్రిప్ట్ రాంచరణ్ కు వినిపిస్తానని లోకేష్ క్లారిటీ ఇచ్చాడు. ఇదే గనక నిజమైతే.. రాంచరణ్, లోకేష్ కలయికలో వచ్చే సినిమా సంచలనమే అవుతుంది. కానీ అలా అవుతుందా లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మాస్టర్ సూపర్ హిట్ అయితే లోకేష్ కోలీవుడ్ ఇండస్ట్రీలో భారీ ఆఫర్లను అందుకుంటాడు. మరి కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు వేరే బాషా హీరోలతో సినిమాలు చేస్తాడా లేదా అనేది చూడాలి.
    

Tags:    
  • Lokesh Kanagaraj 
  • Ram Charan 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS