• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'లైగర్' ట్రైలర్ అప్డేట్:...

'లైగర్' ట్రైలర్ అప్డేట్: మాస్ - యాక్షన్ కు హామీ ఇస్తున్న రౌడీ..!

By - Tupaki Desk
Update: 2022-07-16 12:30 GMT
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''లైగర్''. 'సాలా క్రాస్‌ బ్రీడ్' అనేది దీనికి ట్యాగ్ లైన్. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ లో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'లైగర్' చిత్రాన్ని ఆగస్టు 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ దూకుడుగా ప్రమోషన్స్ చేయడానికి రెడీ అయ్యారు. ఇటీవల విజయ్ దేవరకొండ న్యూడ్ లుక్ తో నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. అలానే ఫస్ట్ సింగిల్ లో VD మాస్ డ్యాన్స్ తో నెట్టింట సందడి చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు ట్రైలర్ ను లాంచ్ చేయడానికి సన్నద్ధం అయ్యారు.

'లైగర్' సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ను జూలై 21న అన్ని భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా వదిలిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ లో విజయ్ దేవరకొండ తన చుట్టూ ఉన్న ఫైటర్‌లను ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు.

ఇప్పటికే విడుదల చేసిన టీజర్ లో విజయ్ దేవరకొండను MMA ఫైటర్‌ గా ప్రెజెంట్ చేస్తూ.. అతని పాత్ర స్వభావాన్ని తెలియజేసారు. మరో ఐదు రోజుల్లో రానున్న ట్రైలర్ లో సినిమాకు సంబంధించిన అసలు కంటెంట్ మరియు ఇతర ప్రధాన నటీనటులను చూపించబోతున్నారు.

బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ 'లైగర్' సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. రమ్యకృష్ణ - రోనిత్ రాయ్ - విషు రెడ్డి - అలీ - మకరంద్ దేశ్ పాండే మరియు గెటప్ శ్రీను తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌ తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరి జగన్నాధ్ - ఛార్మి కౌర్ - కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. థాయ్‌ లాండ్‌ కు చెందిన కెచా స్టంట్ డైరెక్టర్‌ గా వర్క్ చేస్తున్నారు. 'లైగర్' చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.
Tags:    
  • Tollywood 
  • panindia 
  • movie 
  • liger 
  • vijaydevarakonda 
  • staractor 
  • trailerdate 
  • latestnews 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS