'లైగర్' ఫస్ట్ గ్లిమ్స్ అప్డేట్: బీస్ట్ ఎంట్రీ ఎప్పుడంటే..!
డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ - సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ''లైగర్''. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రానికి 'సాలా క్రాస్ బ్రీడ్' అనేది ట్యాగ్ లైన్. కొత్త ఏడాదిని సరికొత్త అప్డేట్స్ తో ఆరంభించడానికి మేకర్స్ రెడీ అయ్యారు.
2021కి ఘనంగా స్వాగతం పలుకుతూ ఈ ఏడాది చివరి రోజైన డిసెంబర్ 31న ''లైగర్'' ఫస్ట్ గ్లిమ్స్ ని రిలీజ్ చేస్తున్నారు. దీని కోసం మూడు రోజుల ముందే సందడి మొదలు పెట్టారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా గ్లిమ్స్ కు సంబంధించిన బిగ్ అనౌన్స్ మెంట్ వీడియోని చిత్ర బృందం ఆవిష్కరించింది.
'లేడీస్ అండ్ జెంటిల్ మెన్..' అనే వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ వీడియో ''లైగర్'' ఫస్ట్ గ్లింప్స్ తేదీ మరియు సమయాన్ని ప్రకటించింది. 'విట్ నెస్ ది మ్యాడ్ నెస్. డిసెంబర్ 31వ తేదీ ఉదయం 10:03 గంటలకు ఫస్ట్ గ్లిమ్స్ ద్వారా బీస్ట్ ని ఈ దేశానికి అందిస్తున్నాం' అని మేకర్స్ వెల్లడించారు.
'లైగర్' నుంచి రేపు (డిసెంబర్ 30) రెండు స్పెషల్ ట్రీట్స్ ఉన్నాయి. ఉదయం 10:03 గంటలకు ప్రత్యేకమైన స్టిల్స్ విడుదల కానుండగా.. సాయంత్రం 4 గంటలకు స్పెషల్ ఇన్స్టా ఫిల్టర్ ఆవిష్కరించబడుతుందని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే విడుదలైన విజయ్ ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో రాబోయే ఫస్ట్ గ్లిమ్స్ మీద అంచనాలు నెలకొన్నాయి.
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో రూపొందుతున్న ''లైగర్''.. భారతదేశంలోని అతిపెద్ద యాక్షన్ చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. ఇది పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ లకు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఈ సినిమాతో ఇండియన్ స్క్రీన్ మీదకు అరంగేట్రం చేస్తున్నారు.
ఇందులో మైక్ టైసన్ ఓ పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. రమ్యకృష్ణ - రోనిత్ రాయ్ - విష్ణు రెడ్డి - అలీ - మకరంద్ దేశ్ పాండే - గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు.
''లైగర్'' చిత్రాన్ని పూరి కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రూపొందిస్తున్నారు. పూరి జగన్నాధ్ - ఛార్మి కౌర్ - కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా కలసి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. థాయ్లాండ్ కు చెందిన కెచా స్టంట్ డైరెక్టర్ గా.. జానీ షేక్ బాషా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
'లైగర్' చిత్రాన్ని 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కానుంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు.

Date & Time Locked!