• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  14 ఏళ్ల తర్వాత ఇద్దరు...

14 ఏళ్ల తర్వాత ఇద్దరు సూపర్‌ స్టార్స్ కలయికలో..!

By - Tupaki Desk
Update: 2023-01-05 09:30 GMT
భాష ఏదైనా మల్టీ స్టారర్ సినిమాలు అంటే ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తూ ఉంటారు. పైగా ఇద్దరు స్టార్‌ హీరోలు స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు అంటే ఆ సినిమా యొక్క క్రేజ్‌ అమాంతం పెరగడం ఖాయం. త్వరలోనే మలయాళి ప్రేక్షకులు ఒక పెద్ద కాంబో సినిమాను వెండి తెరపై ఆస్వాదించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... లిజో జోస్‌ పెల్లిస్సేరీ తో మోహన్‌ లాల్‌ సినిమా ఒకటి ఇటీవల కన్ఫర్మ్‌ అయ్యింది. భారీ బడ్జెట్‌ తో పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందబోతున్న ఈ సినిమాకు మలైకోట్టై వాలిబన్ అనే టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది. ఇటీవలే ఒక ప్రీ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసి అంచనాలు భారీగా పెంచారు.

ఈ సమయంలోనే ఈ ప్రతిష్టాత్మక పీరియాడిక్‌ డ్రామా సినిమాలో మోహన్ లాల్ తో యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ స్క్రీన్‌ షేర్ చేసుకోబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. కమల్‌ హాసన్‌ మరియు మోహన్‌ లాల్ లు 14 ఏళ్ల క్రితం ఉన్నైపోల్ ఒరువన్ సినిమాలో నటించిన విషయం తెల్సిందే.

ఈ ఇద్దరు స్టార్‌ హీరోల యొక్క కలయికలో సినిమా ఇన్నాళ్ల తర్వాత రాబోతున్న నేపథ్యంలో అభిమానులు అంతా ఆసక్తిగా ఉన్నారు. మలైకోట్టై వాలిబన్‌ సినిమాలో కమల్‌ హాసన్ పాత్ర గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. గెస్ట్‌ రోల్‌ లో కనిపించబోతున్నాడా లేదంటే ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ లో కమల్ కనిపిస్తాడా అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

కమల్‌ కెరీర్‌ ఖతం అనుకుంటున్న సమయంలో విక్రమ్‌ తో ఇండస్ట్రీ హిట్ ను కొట్టాడు. దాంతో ఇప్పుడు వరుసగా ఆయన నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్‌ వద్దకు రాబోతున్నాయి. ఈ ఏడాదిలో కమల్‌ రెండు సినిమాలు విడుదల అయ్యే అవకాశం ఉంది. వాటితో పాటు మోహన్ లాల్ తో కలిసి నటించబోతున్న సినిమా మరోటి అవ్వబోతుంది.   




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • LizoJosePellissery 
  • Mohanlal 
  • MalyalamMovieindustry 
  • MalaikottaiVaalibanFilm 
  • MohanlalLizoJoseFilm 
  • KamalHassan 
  • FilmIndustry 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS