చైతన్యతో కలసి స్ర్టాంగ్ క్యారెక్టర్ చేశా

Update: 2017-02-25 05:38 GMT
అక్కినేని నాగార్జునకు జోడీగా సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో కుర్ర నాగ్ తో జత కట్టిన అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి.. ఇప్పుడు నాగచైత్యనతో రొమాన్స్ చేసేస్తోంది. మొదటగా మనం మూవీలో ఓ చిన్న పాత్ర చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మాత్రం కుర్రాడితో రొమాన్స్ పండించేశానని చెబుతోంది.

'మనం సెట్స్ లో  మొదటిసారిగా చైతుని కలిశాను. చాలా తక్కువ సమయమే కలిసి పని చేసినా.. అది మంచి అనుభవం. ఆ తర్వాత నాగార్జునగారితో కలిసి సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో కలిసి నటించాను. ఇప్పుడు చైతుకి జోడీగా నటించే అవకాశం.. ఇంత తొందరగా రావడం యాదృచ్ఛికమే' అంటోంది అందాల రాక్షసి. ఒకటీ అరా మినహాయిస్తే.. ఈ భామకు సక్సెస్ రేషియో ఎక్కువగా ఉండడంతో.. లక్కీ మస్కట్ రేంజ్ లో ఫీలయిపోతున్నారు సినీ జనాలు.

'కామెడీతో పాటు సస్పెన్స్ ను కూడా కలబోసిన ఓ ఫ్యామిలీ డ్రామా ఇది. నేను ఈ సినిమాలో బాగా బోల్డ్ కేరక్టర్ చేశాను. తన ప్రియుడు లక్ష్యాన్ని అందుకునేందుకు సహాయం చేసే కీలకమైన పాత్ర చేశాను.. కేరక్టర్ పరంగా నేను చేసిన సినిమాల్లో ఇది చాలా స్ట్రాంగ్' అంటోంది లావణ్య త్రిపాఠి. ఇవన్నీ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమాకి సంబంధించిన సంగతులు అనే విషయం అర్ధమైపోయింది కదా. ఇదే సినిమాలో రకుల్ ప్రీత్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News