ఫోటో స్టోరీ: నెటిజన్లను గిల్లుతున్న రాక్షసి!
టాలీవుడ్ లో 'అందాల రాక్షసి' గా పేరు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి కెరీర్ ఓ ఏడాది క్రితం మందగించినట్టు కనిపించింది కానీ 'అర్జున్ సురవరం' విజయంతో ఊరట లభించింది. ఇప్పడు చేతిలో మంచి ఆఫర్లే ఉన్నాయి. సినిమాలలో ఎంత బిజీగా ఉండేవారయినా గత రెండు నెలల నుంచి గోళ్ళు గిల్లుకోవడంలో బిజీగా ఉన్నారు. అయితే కొందరు అలా జస్ట్ గిల్లుకోకుండా ఫోటో షూట్లు చేసుకుంటూ నెటిజన్లను గిల్లుతున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా లావణ్య తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "ఇలా మెట్ల మీద పోజు ఇవ్వడం.. సౌకర్యంగా ఉన్నట్టు కవరింగ్ ఇవ్వడం మహా కష్టం బాబూ... 'ఓ మై బ్యాకు!" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో ఒక సూపర్ వుమన్ లాగా డ్రెస్ ధరించి స్టైల్ గా కనిపిస్తోంది. ఈ ఫోటో సంగతి ఇలా ఉంటే లావణ్య ఈమధ్య తన అభిమానులతో నెటిజన్లతో సోషల్ ట్విట్టర్ చాట్ చేసింది. అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. గ్లామరస్ పాత్రలలో నటించేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని అయితే ఆ పాత్రకు గ్లామర్ అవసరం అనిపించాలని తెలిపింది.
ఇక తన కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్తూ ఓ సారి అవుట్ డోర్ లొకేషన్ లో షూట్ జరిగే సమయంలో డ్రెస్ మార్చుకునేందుకు స్థలం లేకపోవడం.. కనీసం క్యారవాన్ కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రొడక్షన్ వ్యాన్ లో బట్టలు మార్చుకున్నానని తెలిపింది. అది ఫ్లాష్ బ్యాక్. ఇక ప్రెజెంట్ కు వస్తే ఇది గోళ్ళు గిల్లుకునే కాలం అయినా తనకు మంచే జరిగిందని..కుటుంబ సభ్యులతో సమయం గడిపే అవకాశం లభించిందని మురిసిపోయింది. ఇక సినిమాల విషయానికి వస్తే లావణ్య ప్రస్తుతం 'A1 ఎక్స్ ప్రెస్'.. 'చావు కబురు చల్లగా' అనే సినిమాల్లో నటిస్తోంది.