• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కోలుకుంటోన్న యంగ్ హీరో

కోలుకుంటోన్న యంగ్ హీరో

By - Tupaki Desk
Update: 2021-09-27 07:47 GMT
యంగ్ హీరో అడ‌వి శేష్ డెంగ్యు జ్వ‌రం బారిన ప‌డి అనారోగ్యానికి  గురైన సంగ‌తి తెలిసిందే.  హైద‌రాబాద్ లోని ఓ ప్ర‌యివేటు ఆసుప‌త్రిలో  చికిత్స పొందుతున్నారు. ర‌క్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య ప‌డిపోవ‌డంతో కాస్త సీరియ‌స్  అయిన‌ట్లు మీడియాలో ప్ర‌చారం సాగింది. సెప్టెంబ‌ర్ 18న హుటాహుటిన ఆసుప‌త్రిలో చేరారు. ఆ రోజు నుంచి ఆసుప‌త్రిలో వైద్యం పొందుతున్నారు. తాజాగా ఆయ‌న కోలుకుంటున్న‌ట్లు తెలిసింది. ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉండటంతో సోమ‌వారం శేషు ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విష‌యాన్ని ట్విట‌ర్ వేదిక‌గా తెలిపారు. ఇంటి ద‌గ్గ‌ర విశ్రాంతి తీసుకుంటున్నా. ఆరోగ్యం బాగానే ఉందని`  తెలిపారు.

ఇక శేషు సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం `మేజ‌ర్` సినిమాలో న‌టిస్తున్నారు. 26/11 ముంబై టెర్ర‌ర్ `ఎటాక్` లో అమ‌రుడైన మేజ‌ర్  ఉన్ని కృష్ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే చాలా భాగం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. షూటింగ్ క్లైమాక్స్ లో ఉంది. ఇప్ప‌టికే విడుద‌లైన ప్ర‌చారం చిత్రాల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. గ‌తంలో న‌టించిన `గుఢ‌చారి` లాంటి సినిమాల‌తో శేషుకి మంచి గుర్తింపు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో మేజర్ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి. ఈ చిత్రానికి శ‌శికిర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీని జీఎంబీ ఎంట‌ర్ టైన్ మెంట్స్-ఏ ప్ల‌స్ ఏస్ మ‌వీస్ -సోనీ పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  

మ‌రోవైపు శేషు  `హిట్` సినిమా సీక్వెల్ లోనూ న‌టిస్తున్నారు. తొలి భాగంలో విశ్వ‌క్ సేన్ న‌టించాడు. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో  దాని సీక్వెల్ లో శేషు న‌టించడంతో సినిమాకు మరింత బ‌జ్ క్రియేట్ అయింది. ఈ జాన‌ర్ చిత్రాల‌కు శేషు ప‌ర్ పెక్ట్ హీరోగా సెట్ అవుతున్నాడ‌ని విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్క‌డం విశేషం. ఈ రెండు సినిమాలు గ‌నుక  మంచి విజ‌యం సాధిస్తే శేషు మార్కెట్ రెండింత‌లు రెట్టింపు అవుతుంది. శేషు మంచి న‌టుడే కాదు..అంత‌కు  మించి రైట‌ర్ కూడా. ఈ రెండు సినిమాల విష‌యంలో స్ర్కిప్ట్ వ‌ర్క్ లోనూ శేషు హ‌స్తం ఉంది.
Tags:    
  • adivi sesh 
  • adivi sesh health 
  • adivi sesh health condition 
  • adivi sesh movies 
  • adivi sesh tweet 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS