• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నా కల .. నా ముందున్న...

నా కల .. నా ముందున్న లక్ష్యం అదే: అలియా భట్

By - Tupaki Desk
Update: 2022-02-21 05:29 GMT
బాలీవుడ్ భామల విషయానికి వస్తే అలియా భట్ 'పిట్టకొంచెం కూత ఘనం' అన్నట్టుగా కనిపిస్తుంది. తన పాత్రకి న్యాయం చేయడానికీ .. కొత్తగా కనిపించడానికి ఎంతమాత్రం వెనుకాడని స్వభావం ఆమె సొంతం.

గ్లామర్ పరంగా .. నటన పరంగా తనకంటే మెరుగైన భామలు బాలీవుడ్ లో ఉన్నప్పటికీ అరుదైన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఆమె మహా నేర్పరి అంటూ ఉంటారు. పాత్ర ఎలాంటిదైనా చాలా కాన్ఫిడెంట్ తో చేస్తూ ముందుకు వెళ్లడం ఆమె ప్రత్యేకతని చెబుతుంటారు. ఒక వైపున స్టార్ హీరోల సరసన అందాల సందడి చేస్తూనే, మరో వైపున నాయిక ప్రధానమైన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళుతోంది.

ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'గంగూబాయి కథియావాడి' రెడీ అవుతోంది. ముంబై కామాటిపుర ప్రాంతానికి చెందిన ఒక వేశ్య కథ ఇది. ఈ పాత్రలో ఆమె అనేక వేరియేషన్స్ ను చూపించనుంది. అలాగే లుక్ పరంగా కూడా వైవిధ్యభరితంగా కనిపించనుంది. ఈ పాత్రలో తన బాడీ లాంగ్వేజ్ ను ఆమె మార్చుకున్న తీరు చూసి ఇప్పటికే చాలామంది షాక్ అవుతున్నారు. అంతగా ఆమె ఈ పాత్ర కోసం తనని తాను మార్చుకోవడం .. మలచుకోవడం కనిపిస్తోంది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో అలియా చాలా బిజీగా ఉంది. తాను పోషించిన పాత్రను .. ఆ పాత్రలోని ప్రత్యేకతను .. అందుకోసం చేసిన సాధనను గురించి చెబుతూ, ఈ సినిమాపై ఆసక్తిని .. అంచనాలను పెంచుతోంది. ఈ పాత్రలో తాను అంతగా ఇన్వాల్వ్ కావడానికి కారకురాలు శ్రీదేవి అంటూ ఆమె తాజా ఇంటర్వ్యూలో చెప్పింది. "శ్రీదేవి చాలా గొప్ప నటి .. ఒక వైపున గ్లామరస్ గా కనిపిస్తూనే, మరో వైపున బరువైన పాత్రల్లోను అంతేలా మెప్పించడం ఆమెకి మాత్రమే సాధ్యమైంది. ఆమె ఏ పాత్రను పోషించినా ఏ మాత్రం ఆ గ్రేస్ తగ్గేది కాదు.

శ్రీదేవి సినిమాలు ఎప్పుడు చూసినా .. ఎన్నిమార్లు చూసినా పాత్ర మాత్రమే తెరపై కనిపిస్తుంది. అలాగే ఆమె ఏ పాత్ర పోషించినా ఆ పాత్రపై తనదైన ముద్ర ఉంటుంది. అందుకే ఆమె పట్ల అభిమానం ఎవరిలోను ఎంతమాత్రం తగ్గలేదు. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో తిరుగులేని స్టార్ హీరోయిన్ అనిపించుకోవడం మామూలు విషయం కాదు.

అందుకే నేను ఏ పాత్రను పోషిస్తున్నా ఆమెనే స్ఫూర్తిగా తీసుకుంటాను. ఆమె మాదిరిగానే కష్టపడటానికి నా వంతు ప్రయత్నం చేస్తుంటాను. 'గంగూబాయి' సినిమా విషయంలోను అలాగే కష్టపడ్డాను. శ్రీదేవిలా పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవడమే నా ముందున్న లక్ష్యం" అని ఆమె చెప్పుకొచ్చింది. 
Tags:    
  • gangubhai 
  • Aliabhatt 
  • sanjayleela 
  • aliabatt 
  • Dream 
  • Goal 
  • movienews 

Similar News

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

Copyright @2026

Powered by Blink CMS