• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సంక్రాంతికి 'ఆర్ ఆర్ ఆర్'...

సంక్రాంతికి 'ఆర్ ఆర్ ఆర్' రానేరాదంటున్నారే!

By - Tupaki Desk
Update: 2021-10-08 05:30 GMT
జనవరి 7వ తేదీన 'ఆర్ ఆర్ ఆర్' వస్తోంది అనగానే .. పక్కకి పక్కకి జరగండి అనేసి, ఆ చుట్టుపక్కల ఉన్న సినిమాలన్నీ సర్దుకుని తప్పుకుంటాయని చాలామంది అనుకున్నారు. కానీ అలాంటిదేం జరగలేదు .. జరిగే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఎందుకని అలా అంటే .. 'ఆర్ ఆర్ ఆర్' సంక్రాంతికి వచ్చే ఛాన్స్ లేదు గనుక అనేసి తాపీగా సమాధానం చెబుతున్నారు. పక్కానా? అంటే .. 'లాక్ చేసుకో' అంటున్నారు. అంత పెద్ద సినిమా వస్తుంటే వీళ్లకి కనీసం కందిరీగ కొట్టినట్టుగా కూడా లేదే అనిపించడం సహజం. కానీ ఈ సినిమా రాదనడానికి కొంతమంది కొన్ని లెక్కలు చెబుతున్నారు.

సంక్రాంతి బరిలో ఆ మూడు రోజులను నమ్ముకుని మూడు సినిమాలు బరిలోకి దిగాయి. జనవరి 12వ తేదీన 'భీమ్లా నాయక్' సినిమాను విడుదల చేయనున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, పవన్ - రానా ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ నెలాఖరుతో షూటింగు పార్టు పూర్తవుతుందని అంటున్నారు. ఆ తరువాత మిగతా పనులను కంప్లీట్ చేయడానికి వాళ్లకి కావలసినంత సమయం ఉంది గనుక, 'భీమ్లా నాయక్' రావడంలో ఎలాంటి డౌట్ ఎవరిలో కనిపించడంలేదు.

ఆ మరుసటి రోజైన జనవరి 13వ తేదీన 'సర్కారువారి పాట' రానుంది. మహేశ్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా, ఆలస్యంగా  సెట్స్ పైకి వెళ్లింది. కానీ సెట్స్ పైకి వెళ్లిన తరువాత ఆలస్యం చేయలేదు. అందువలన రెండు పాటల మినహా మిగతా షూటింగును ఈ నెలలో పూర్తిచేయనుంది. వచ్చేనెలలో ఆ రెండు పాటలను పూర్తిచేసి, జనవరిలో రిలీజ్ కి రెడీ అవుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక జనవరి 14వ తేదీన రానున్న 'రాధే శ్యామ్' కూడా ముందుగా చెప్పిన తేదీ పైనే ధైర్యంగా నిలబడ్డాడు.

'ఆర్ ఆర్ ఆర్' జనవరి 7వ తేదీన వస్తుందనే అధికారిక పోస్టర్ రాగానే, ఈ సినిమాలన్నీ కూడా తమ విడుదల తేదీలు మార్చుకుంటాయనీ .. వేసవి సెలవుల దిశగా పరిగెడతాయని అనుకున్నారు. కానీ కొంచెం కూడా కదలకుండా కాలుమీద కాలేసుకుని అలాగే కూర్చున్నాయి. అందుకు కారణం 'ఆర్ ఆర్ ఆర్' రాదనే నమ్మకమేనని అక్కడున్నవాళ్లు అంటు న్నారు. 'ఆర్ ఆర్ ఆర్'కి సంబంధించి కొన్ని వందల సీజీ షాట్లను రాజమౌళి ఓకే చేయవలసి ఉందట. రాజమౌళి ఓకే చెప్పిన తరువాతనే ఆ సంస్థలు తమ వర్క్ ను పూర్తి చేయవలసి ఉంటుంది.

అయితే ఇది అంత తేలికగా అయ్యే పనేం కాదు .. ఇందుకు చాలా సమయమే పండుతుందని అంటున్నారు. ఆ తరువాత ఒకదానికి తరువాత ఒకటిగా ప్రాసెస్ పూర్తిచేసుకుని ఫస్టు కాపీ రావడం సంక్రాంతి నాటికి జరగదని అంటున్నారు. మార్చి లో మాత్రమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇటు చూస్తేనేమో సవరణలు .. అటు చూస్తేనేమో వివరణలు .. విశ్లేషణలు .. ఏది నమ్మలబ్బా?! అంటూ సినిమా ప్రేమికులు చిటపటలాడుతున్నారు. సినిమా అంటే వేలకోట్ల వ్యాపారం .. వీలు .. వాలు చూసుకునే వస్తుంది మరి!                
Tags:    
  • RRR 
  • RRR movie 
  • RRR Release Date 
  • RRR Shooting 
  • NTR 
  • Ramcharan 
  • Rajamouli 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS