• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పాన్ ఇండియా 'మేజర్'...

పాన్ ఇండియా 'మేజర్' రిలీజ్ డేట్ రాబోతోంది..!

By - Tupaki Desk
Update: 2021-10-25 07:31 GMT
26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన ఎన్ఎస్‌జి కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ''మేజర్''. టాలెంటెడ్ హీరో అడివి శేష్ ఇందులో టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు. GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామిగా ఉండటంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది.

పాన్ ఇండియా స్థాయిలో పలు ప్రధాన భారతీయ భాషల్లో ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి మేకర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి అడివి శేష్ కథ - స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. 'గూఢచారి' ఫేమ్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఫైన‌ల్ షెడ్యూల్ చిత్రీకరణ జ‌రుగుతోంది. ఇటీవల అనారోగ్యానికి గురై తిరిగి కోలుకున్న శేష్.. రెట్టింపు ఎనర్జీతో ఉత్సాహంతో ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారని తెలుస్తోంది.

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం లేకపోయ్యుంటే ఈపాటికే 'మేజ‌ర్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. అయితే ఇప్పుడు షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని సరైన తేదీని లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ షూటింగ్ పూర్తయిన వెంటనే వీలైనంత త్వరగా మిగతా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపనున్నారు.

కాగా, 'మేజర్' చిత్రంలో తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల - బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ - రేవతి - మురళీ శర్మ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అబ్బూరి ఈ చిత్రానికి రవి సంభాషణలు రాస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Tags:    
  • Major Movie 
  • Major Movie release date 
  • Major Movie Shooting 
  • Adivi Sesh 
  • Major Movie Teaser 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS