• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఎఫ్‌ 4' ఉంటుంది, కాని..!

'ఎఫ్‌ 4' ఉంటుంది, కాని..!

By - Tupaki Desk
Update: 2022-05-29 06:33 GMT
మూడున్నర సంవత్సరాల క్రితం వచ్చిన ఎఫ్‌ 2 సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అప్పుడే ఎఫ్‌ 3 కి సంబంధించిన ప్రకటన వచ్చింది. కరోనా ఇతరత్ర కారణాల వల్ల ఎఫ్‌ 3 ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు ఎఫ్ 2 సీక్వెల్‌ అన్నట్లుగా ఎఫ్ 3 విడుదల అయ్యింది. ఎఫ్ 2 కథ కి ఎఫ్‌ 3 కథకు ఎక్కడ సంబంధం లేకుండా ఉంది. కేవలం పాత్రలను కంటిన్యూ చేయడం జరిగింది.

ఎఫ్‌ 3 కి పాజిటివ్ రెస్పాన్స్ దక్కిన నేపథ్యంలో ఎఫ్‌ 4 ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఎఫ్‌ 4 గురించి ఇప్పటికే పలు సార్లు దర్శకుడు అనీల్ రావిపూడి మరియు దిల్‌ రాజు లు కూడా స్పందించారు. హీరోలు అయిన వెంకటేష్ మరియు వరుణ్‌ తేజ్ లు కూడా ఎఫ్‌ 4 ఉంటుందనే ఇటీవల ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. వరుణ్‌ ఒక ఇంటర్వ్యూలో ఎఫ్‌ 4 కోసం రెండు మూడు స్టోరీ లైన్స్ ను కూడా దర్శకుడు అనిల్ రావిపూడి రెడీ చేశాడు అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా ఎఫ్‌ 4 గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎఫ్‌ 4 ఖచ్చితంగా ఉంటుంది కాని హీరోలు హీరోయిన్స్ వేరే ఉండవచ్చు అంటూ  అనిల్ రావిపూడి టీమ్‌ మెంబర్స్ మరియు దిల్‌ రాజు కాంపౌండ్‌ కు చెందిన వారు ఆఫ్‌ ది రికార్డ్‌ చెబుతున్నారు. ఎఫ్‌ 3 సినిమా నే వేరే నటీ నటులతో చేయాలనుకున్నాడు అనీల్ రావిపూడి. కాని ఎఫ్ 2 యొక్క మ్యాజిక్ మరియు ఫ్లేవర్‌ కంటిన్యూ అవ్వదనే ఉద్దేశ్యంతో మొత్తం వారినే దించాడు.

ఎఫ్‌ 2 లో నటించిన వారినే ఎఫ్ 3 లో నటింపజేయడం వల్ల భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చి నటింపజేయాల్సి వచ్చింది. తద్వారా కాస్త బడ్జెట్‌ ఎక్కువ అయ్యింది అనేది దిల్‌ రాజు అభిప్రాయం. అందుకే ఎఫ్ 4 చేస్తే వేరే హీరోలు హీరోయిన్స్ తో చేయడం బెటర్‌ అనే నిర్ణయానికి వచ్చాడట. ఆ విషయంలో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

అనిల్ రావిపూడి త్వరలో బాలకృష్ణ 108వ సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తి అవ్వొచ్చిందట. అనిల్ రావిపూడి తదుపరి సినిమాల విషయంలో ఇప్పటికే ఒక క్లారిటీ అనేది వచ్చిన నేపథ్యంలో ఎఫ్‌ 4 కు చాలా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఎఫ్‌ 4 కోసం ఇప్పటి నుండే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు. ఎఫ్‌ 4 సినిమా ను ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా అనిల్ రావిపూడి చేస్తాడని చాలా మంది ఎదురు చూస్తున్నారు.
Tags:    
  • F3 
  • Venkatesh 
  • Varun Tej 
  • Tamanna 
  • Meherene 
  • Anil Ravipudi 
  • Dilraju 
  • F4 
  • Updates 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS