• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎన్టీఆర్ ఆవేదనే సినిమాలో...

ఎన్టీఆర్ ఆవేదనే సినిమాలో చూపించాం

By - Tupaki Desk
Update: 2019-02-06 09:55 GMT
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చివరి రోజుల్లో ప్రస్తావించించిన ఆవేదనే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో పాట రూపంలో చూపించామని నిర్మాత రాకేష్ రెడ్డి కోర్టుకు విన్నవించారు. తెలుగుదేశం పార్టీ నేతలు సినిమాలోని పాటపై వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన కోర్టును కోరాడు.

రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై టీడీపీ నేతలు మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాలోని ఓ పాటలోని పదాలు టీడీపీ నేతలను కించపరిచేలా ఉన్నాయని ఓ టీడీపీ ఎమ్మెల్యే వర్మపై కో్ర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమాలోని పాటను యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయించాలని ఆయన కోర్టుకు విన్నవించారు. దీంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రూపకర్తలు కోర్టుకు కౌంటర్ దాఖలు చేశారు.

ఎన్టీఆర్ తన జీవిత చరమాంకంలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జరిగిన అన్యాయం, చంద్రబాబు తీరుపై ఏ స్థాయిలో మాట్లాడారో కోర్టుకు వివరించారు. స్వయంగా ఎన్టీఆర్ తనకు జరిగిన దగా, కుట్రలపై వివరించారని.. ఆయన ఆవేదననే ఓ పాటలో చిత్రీకరించామని నిర్మాత పేర్కొన్నారు.. అలాగే ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకాల్లో రాసిన అంశాలనే సినిమాలో చూపించామని పేర్కొన్నారు.

సినిమాలో చూపిస్తున్న పాట.. ఎన్టీఆర్ చనిపోకముందే కవి శ్రీశ్రీ   రాశారని.. కేవలం టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడి మెప్పుకోసం టీడీపీ నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. దీనిని కోర్టు గుర్తించి కేసును కొట్టివేయాలని లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత కోర్టును అభ్యర్థించారు. కోర్టు ఏ ఆదేశాలచ్చినా దానికి కట్టుబడి ఉంటామని సినిమా నిర్వాహకులు చెబుతున్నారు.

ఏదిఏమైనా ఈ సినిమాలోని పాటను ఉంచినా, డిలిట్ చేసినా టీడీపీ కావాల్సినంత డ్యామేజ్ జరిగిపోయింది. వర్మ సినిమాలకు కంట్రవర్సీలే పబ్లిసిటిగా మారుతుంటాయి. అందుకు తగ్గట్టుగానే టీడీపీ నేతలు వర్మపై కోర్టుకు ఎక్కి ఆయన కావాల్సినంత పబ్లిసిటిని ఫ్రీగా చేస్తున్నారు. టీడీపీ నేతలు చేస్తున్న పనివల్ల ఆ పార్టీకి డ్యామేజ్ తప్ప వర్మకు పోయేదేమీ లేదని పైగా ఆయన అనుకున్నదే జరుగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు వర్మపై పోరాటాన్ని పక్కకుపెట్టి ఎన్నికలపై దృష్టిసారిస్తారో లేక వర్మపై పోరాటం అంటూ రచ్చ చేసుకుంటారో చూడాలి మరీ.
   

Tags:    
  • Lakshmis NTR producer 
  • Rakesh Reddy 
  • TDP 
  • Latest News 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS