మరో కమెడియన్ కన్నుమూత..

Update: 2016-02-27 07:22 GMT
తెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్ల వరుస మరణాలు కలచివేస్తున్నాయి. తాజాగా హాస్య నటుడు పొట్టి రాంబాబు మరణం నుంచి ఇంకా టాలీవుడ్ తేరుకోకుండానే మరో కమెడియన్ కన్ను మూయడం విషాదం కలిగించింది. అనేక సినిమాల్లో హాస్య పాత్రలను పోషించిన బండ జ్యోతి మరణంతో.. టాలీవుడ్ మరోసారి నివ్వెర పోయింది.

చిత్రపురికాలనీలో సినీనటి బండ జ్యోతి గుండెపోటుతో మృతి చెందారు. తోకలేని పిట్ట - భద్రాచలం - కల్యాణరాముడు - విజయరామరాజు - స్వయంవరం - అందగాడు - గణేష్‌ వంటి చిత్రాల్లో బండ జ్యోతి చేసిన పాత్రలకు పేరు వచ్చింది. జ్యోతి మృతి పట్ల జూనియర్ ఆర్టిస్టులు - సినీనటులు సంతాపం తెలిపారు. కొద్దిరోజులుగా ఆమెకు అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. మృతికి సరైన కారణాన్ని వైద్యులు ఇంకా ధృవీకరించలేదు. శుక్రవారం సాయంత్రమే ఈమె మరణం సంభవించింది. జ్యోతి మృతికి టాలీవుడ్ అంతా సంతాపం ప్రకటించింది.

తోటి నటిని కోల్పోయామని చాలామంది నటులు విషాదం వెలిబుచ్చారు. నటనలో ఎంతో సీనియర్ అని, తమ అందరికీ పెద్ద అక్క లాంటి బండ జ్యోతిపై కమెడియన్లు కుటుంబం అంతా విషాదంలో మునిగిపోయిందని చెప్పారు
Tags:    

Similar News