• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైల‌ర్ టాక్: లాఠీ...

ట్రైల‌ర్ టాక్: లాఠీ ప‌వ‌రేంటో! చూపించాడు

By - Tupaki Desk
Update: 2022-12-12 12:58 GMT


స్టార్ హీరో విశాల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతడి తమిళ యాక్షన్ సినిమాలు తెలుగులోకి డబ్ అయి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విశాల్ కథానాయకుడిగా ఎ. వినోద్ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం `లాఠీ`  రూపొందుతోంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ - నందా సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో విశాల్ సరసన సునైనా హీరోయిన్ గా నటిస్తోంది.


తెలుగు- తమిళం- హిందీ- కన్నడ- మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా అన్ని భాషలకు ఒకే టైటిల్ ను ఖరారు చేశారు. సరికొత్త కథాంశంతో వినోద్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

లాఠీకి సమాజంలో మార్పు తీసుకురాగల శక్తి ఉంది. ఆ `లాఠీ`తో విశాల్ సమాజంలో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టాడన్నది తెరపైనే చూడాలి. ఈ చిత్రంలో విశాల్ పూర్తిస్థాయి యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలో నటిస్తున్నాడు. సెకండాఫ్ లో 45 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఇప్పటివరకూ రిలీజైన పోస్టర్లు ప్రీటీజర్ ని బట్టి విశాల్ మరో లెవల్ యాక్షన్ మూవీలో నటించాడని అర్థమవుతోంది.

తాజాగా కొద్ది సేప‌టి క్రిత‌మే ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ట్రైల‌ర్ లోనే లాఠీ ప‌వ‌రేంటో చూపించాడు. విశాల్ మార్క్ యాక్ష‌న్..పెర్పార్మెన్స్  ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. లాఠీ స్పెష‌లిస్ట్  ముర‌ళీ రంగంలోకి దిగితే  ఎవ‌రికైనా సీన్ సితారే అవ్వాల్సిందే అన్న‌ట్లు ప‌వ‌ర్ ఫుల్ ఎంట్రీ అదిరిపోయింది. `లాఠీ దెబ్బ‌కు నిజం క‌క్కాలి`..`నీలాంటి వాళ్ల‌ను చేతికి లాఠీ ఇచ్చి కొట్ట‌మంటే పై వాళ్లు మాకు ఇచ్చేది ఆర్డ‌ర్ కాదురా..ఆఫ‌ర్`` లాంటి డైలాగులు ఆక‌ట్టుకుంటున్నాయి.

ఇందులో ఓ మంచి ఫ్యామిలీ పోలీస్ ని కూడా చూపించారు. ఈ లాఠీ పోలీస్ కాస్త రొమాంటిక్ గానూ క‌నిపిస్తున్నాడు. టైటిల్ కి త‌గ్గ‌ట్టు ట్రైల‌ర్ లో ఆద్యంతం లాఠీని బాగా హైలైట్ చేసారు. తుపాకులతోనే కాదు వ్య‌వ‌స్థ‌ని లాఠీతోనూ ఎలా అదుపు చేయోచ్చో ఈ పోలీస్ చూపించాడు.  లాఠీ పోలీస్ చేతిలోభారీ  స‌మ్మెట చేత ప‌డితే   ఎలా ఉంటుందో కూడా హైలైట్ చేసారు.  మ‌రి ఈ లాఠీ పోలీసు పుల్ ర‌న్ లో ఇంకెలాంటి విశ్వ‌రూపం చూపిస్తాడో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    
  • Laatti 
  • Trailer 
  • movie 
  • Vishal 
  • Sunainaa 
  • VinothKumar 
  • YuvanShankarRaja 

Similar News

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS