• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తనలోని మరో యాంగిల్...

తనలోని మరో యాంగిల్ చూపిస్తానంటున్న భూమిక

By - Tupaki Desk
Update: 2020-03-19 10:50 GMT
తెలుగులో సుమంత్ నటించిన 'యువకుడు' సినిమా ద్వారా పరిచయమైన భూమికా చావ్లా 'ఖుషి' సినిమాతో యువ‌తరం హృద‌యాల్ని దోచుకుంది. 'ఖుషి' సినిమాలో అమ్మడు నడుము సీన్ ఇప్పటికీ సంచలనమే. భూమిక ఒక‌ప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో కుర్రాళ్ల‌కు తార‌క‌మంత్రం. ఖుషీ లాంటి సంచ‌ల‌న సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా కూడా భూమికను మాత్రం ఖుషీ హీరోయిన్‌గానే గుర్తు పెట్టుకున్నారు ప్రేక్షకులు. ఆ త‌ర్వాత ఒక్క‌డు, సింహాద్రి లాంటి ఇండ‌స్ట్రీ హిట్స్ లో న‌టించిన భూమిక‌ సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరి సరసన నటించింది. కెరీర్ మంచి పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు భ‌ర‌త్ ఠాకూర్‌ ని పెళ్లి చేసుకొని సినిమాల‌కు కొన్నాళ్ల పాటు దూరం అయింది. ఆ త‌ర‌వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌పై దృష్టి పెట్టి నిర్మాత‌గానూ మారింది. ఆ సమయంలో బాలీవుడ్ వెళ్లి అక్క‌డ కొన్ని సినిమాలు చేసింది. 'ఎమ్మెస్ ధోనీ' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన భూమిక‌, ఈ చిత్రంతో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చింది. తెలుగులో నాగచైతన్య 'సవ్యసాచి' మరియు నాని హీరోగా నటించిన 'ఎంసీఏ' మూవీలలో కీల‌క పాత్రలు పోషించింది. బాలకృష్ణ 'రూల‌ర్‌'లోనూ నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడామె చేతిలో రెండు మూడు సినిమాలు దాకా ఉన్నాయి. ఐతే భూమిక చావ్లాకి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే భూమిక త్వ‌ర‌లోనే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతోందని తెలుస్తోంది. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లంటే ఇష్టమని, ‘మిస్స‌మ్మ‌’లో నా పాత్ర అలానే కొనసాగినా చివ‌ర్లో క‌థంతా మారిపోతుందని, ఈసారి అలా కాకుండా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా నెగటివ్ షేడ్స్ లో కొనసాగుందని, ఓ ర‌కంగా చెప్పాలంటే లేడీ విల‌న్ పాత్ర‌ అని చెప్పుకొచ్చింది. అయితే ఆ సినిమా పేరేమిటో రెవీల్ చేయలేదు. ఇది ఒక స్టార్ హీరో సినిమానే అని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ హీరో ఎవ‌రో, ఆ సినిమా ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఏదేమైనా భూమిక కోరిక మాత్రం ఈసినిమాతో తీర‌బోతోందని అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Tags:    
  • Khusi Heroine Turns Into A Baddie 
  • Tollywood 
  • Tollywood Actress 
  • Bumika Turns Into A Baddie 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS