• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #KRKR: వ‌ర్మ‌ పై కేఏ పాల్...

#KRKR: వ‌ర్మ‌ పై కేఏ పాల్ ఫ్యాన్స్ సీరియ‌స్

By - Tupaki Desk
Update: 2019-11-10 04:47 GMT
కాదేదీ క‌విత‌ కు అన‌ర్హం అన్నాడో క‌వి... కాదేదీ వివాదానికి అనర్హం అంటున్నాడు రామ్‌ గోపాల్‌ వ‌ర్మ‌. ఓ క‌వి దేని మీదైనా క‌విత‌ను అల్లేయ‌డం చూశాం కానీ.. వ‌ర్మ లా ఏది దొరికితే దాన్ని వివాదం గా మారుస్తూ వార్త‌ల్లో నిలవ‌డం చూడ‌నేలేదు. వివాదాల‌ తో స‌హ‌ జీవ‌నం చేయ‌డం వ‌ర్మ నైజం. ద‌ర్శ‌కుడి గా అత‌ని ఆయుష్షును  పెంచిన పాయింట్ ఇది. ఏపీ ఎన్నిక‌ల వేళ `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` సినిమాతో త‌న‌కు కావాల్సినంత ర‌చ్చ‌ చేసి టీడీపీ ని.. చంద్రబాబు నాయుడి ని ఆడుకున్న రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా మ‌రో అస్త్రం తో సంచ‌ల‌నాల‌కు తెర‌లేపిన విష‌యం తెలిసిందే.

వివాదాల వ‌ర్మ తాజా గా తెర‌కెక్కిస్తున్న `క‌మ్మ‌ రాజ్యంలో క‌డ‌ప‌ రెడ్లు` ప్ర‌చారార్భాటం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ ని వ‌దిలిన వ‌ర్మ  కేఏ పాల్ పై ఇటీవ‌ల ఓ పాట‌ని కూడా వ‌ద‌ల‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. కామిక్ బుక్సుల్లో వున్న కామిక్ క్యారెక్ట‌ర్ నిజ నీవితం లోకి వ‌చ్చిన‌ట్టుంద‌ని కేఏపాల్ ని పోల్చిన వ‌ర్మ ఈ సినిమా తో మ‌రో వివాదానికి తెర‌ లేప‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యాని కి గురిచేస్తోంది. కేఏ పాల్ ని ఓ కామెడీ పీస్ గా తేల్చేసిన వ‌ర్మ అత‌ని పాత్ర‌ కు సినిమాలో ఓ పాట‌ని కూడా ప్ర‌త్యేకం గా రాయించి విడుద‌ల చేయ‌డం ప‌లువురిని విస్మ‌యాన్ని క‌లిగిస్తోంది.

అయితే మ‌త ప్ర‌భోద‌కుడైన పాల్ ని ఆడుకున్న వ‌ర్మ‌పై ప్ర‌స్తుతం క్రైస్త‌వ మ‌త వ‌ర్గాలు సీరియ‌స్ గా ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఈ వ్య‌వ‌హారం పై సినిమా రిలీజ్ ముంగిట బోలెడంత‌ ర‌చ్చ మొద‌ల‌య్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. పాల్ పై రిలీజ్ చేసిన పాటని చూస్తుంటే కేఏ పాల్‌ కు వ‌ర్మ కు మ‌ధ్య మ‌ళ్లీ గొడ‌వ‌లు కావ‌డం ఖాయం గా క‌నిపిస్తోంది. మ‌రోవైపు ఆర్జీవీ టీవీ డిబేట్ల‌ లో చంద్ర‌బాబు-లోకేష్-పాల్-ప‌వ‌న్ అంద‌రి పైనా సెటైర్లు వేస్తూ కామెడీలు చేస్తూ త‌న‌కు కావాల్సిన ప‌బ్లిసిటీ చేసుకుంటున్నాడు. తాజాగా ఆర్జీవీ ఫేవ‌రెట్ యాంక‌ర్ స్వ‌ప్న‌తో చిట్ చాట్ లో పాల్ పై ప‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం తో హీట్ రాజుకుంటోంది.
Tags:    
  • Ka Paul Fans Serious On Rgv 
  • Ka Paul 
  • Ram Gopal Varma 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Tollywood News 
  • Telugu Movie News 
  • Kamma Rajyam Lo Kadapa Redlu 
  • Tupaki News 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS