• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్ అంటే చాలా ఇష్టం:...

చరణ్ అంటే చాలా ఇష్టం: 'ఉప్పెన' బ్యూటీ!

By - Tupaki Desk
Update: 2022-01-18 09:11 GMT
'ఉప్పెన' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి వరుస సక్సెస్ లతో దూసుకుపోతోంది. తాజాగా 'ఆలీతో సరదాగా'లో ఆమె మాట్లాడుతూ .. "బేసిగ్గా మాది 'ఉడిపి' పక్కన ఒక ఊరు .. కానీ నేను ముంబైలో పుట్టి పెరిగాను. మొదటి నుంచి కూడా నేను ఎవరితో ఎక్కువగా కలిసే దానిని కాదు. నేను కాస్త అందరిలో కలుస్తాననే ఉద్దేశంతో యాక్టింగ్ వైపు పంపించాలని మా పేరెంట్స్ అనుకున్నారు. ఆ సమయంలో యాడ్స్ చేయడానికి అవకాశం రావడంతో చేశాను. ఆ సమయంలో నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నా దగ్గరికి 'ఉప్పెన' కథ వచ్చింది. ముందుగా చేయనని చెప్పాను .. కానీ కథ విన్న తరువాత ఈ సినిమా చేయాలని అనుకున్నాను.

'ఉప్పెన' సినిమా నుంచి 'నీ కన్ను నీలి సముద్రం' పాటను రిలీజ్ చేసినప్పుడు నాకు చాలా మెసేజ్ లు వచ్చాయి. అంతా ఆ పాటను గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మా ఫ్యామిలీ నుంచి ఎవరూ ఇండస్ట్రీలో లేకపోవడం వలన, నాకు చాలా కొత్తగా అనిపించింది. నేను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాననే విషయం అప్పుడే నాకు అర్థమైపోయింది. ముందుగా నాకు తెలుగు అంత బాగా రాదు. 'ఉప్పెన' సినిమా షూటింగు సమయంలో అంతా తెలుగులో మాట్లాడుతుంటే, నాకు తెలుగు రాకపోవడం వలన వాళ్లకి కనెక్ట్ కాలేకపోయాను. అందువలన ఆ తరువాత నుంచి తెలుగు సినిమాలు ఎక్కువ చూశాను .. తెలుగును నేర్చుకున్నాను.

'శ్యామ్ సింగ రాయ్' హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. 'బంగార్రాజు'లో చైతూతో కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది. ఇంట్లో నేను ఎక్కువ అల్లరి చేస్తుంటాను .. 'బంగార్రాజు' సెట్లోను అలాగే ఉన్నాను. ఎందుకంటే కల్యాణ్ కృష్ణ గారు నాకు అంత కంఫర్టును ఇచ్చారు. 'ఉప్పెన' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారు నా గురించి చెప్పిన మాట నాకు ఓ గిఫ్ట్ లా అనిపించింది. ఆ తరువాత ఆయన తన చేత్తో చాలామంచి మాటలతో ఒక లెటర్ రాసి, దానితో పాటు ఒక గిఫ్ట్ పంపించారు. ఆ లెటర్ ని ఫ్రేమ్ కట్టించుకున్నాను. మెగాస్టార్ గారు మెచ్చుకోవడం గొప్పవిషయం.

'శ్యామ్ సింగ రాయ్'లో నేను సెకండ్ హీరోయిన్ ను అనే ఆలోచన నాకు రాలేదు. సినిమా టీమ్ కూడా ఎక్కడా నాకు ఆ ఫీలింగ్ ను రానీయలేదు. 'ఉప్పెన'లో నేను చేసిన పాత్రకి పూర్తి డిఫరెంట్ గా ఉండటం వలన, 'శ్యామ్ సింగ రాయ్'లో చేశాను. కొత్త పాత్రల వలన కొత్త విషయాలను నేర్చుకోవచ్చుననే ఉద్దేశంతోనే ఆ సినిమాను చేశాను. ఇక 'బంగార్రాజు'లో నేను సర్పంచ్ 'నాగలక్ష్మి'గా కనిపిస్తాను. నేను మంచిగా ఉన్నంతవరకే సర్పంచ్ నాగలక్ష్మి .. తేడా వస్తే సింహం లాంటి లక్ష్మి. తెలుగులో అందరి హీరోలతోను చేయాలనుంది. ముఖ్యంగా చరణ్ గారితో చేయాలనుకుంటున్నాను. ఆయన చేసిన 'రంగస్థలం'  చూశాను .. ఆ సినిమాలో ఆయన గొప్పగా చేశారు" అంటూ తన మనసులోని మాటను బయట పెట్టింది.
Tags:    
  • Kriti Shetty 
  • Kriti Shetty movies 
  • Kriti Shetty shyam singha roy 
  • Kriti Shetty bangarraju 
  • Kriti Shetty aa ammai gurinchi meeku cheppali 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS