టైటిల్ ఫిక్స‌యినా ఎందుకీ ఆల‌స్యం క్రిష్‌?

Update: 2020-12-03 06:15 GMT
సినిమాకి టైటిలే స‌గం బ‌లం. స‌క్సెస్ కి ప్ర‌ధాన ఆయుధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అందుకే టైటిల్ ఎంపిక విష‌యంలో చాలా స‌మ‌యం శ్ర‌ద్ధ తీసుకుంటారు.  సెన్సిటివ్ సినిమాల‌ ద‌ర్శ‌కుడు క్రిష్ తన సినిమా టైటిల్ ఎంపిక విష‌యంలో అంతే ఆచితూచి అడుగులు వేస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. అలాగే త‌న టైటిల్లో తెలుగుద‌నానికి పెద్ద పీట వేస్తారాయ‌న‌.
 
కృష్ణ వైష్ణవ్ తేజ్- రకుల్ ప్రీత్ నాయ‌కానాయిక‌లుగా క్రిష్ ప్ర‌స్తుతం ఓ సినిమా తీస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని కొండ‌పొలం అనే నవల ఆధారంగా రూపొందిస్తున్నారు. ఆ నవలను క్రిష్ ఎంతగానో ప్రేమించారు గ‌నుకే సినిమాగా మ‌లిచార‌ట‌. అంతేకాదు  న‌వ‌లా రచయితకు పెద్ద మొత్తాలను చెల్లించి హక్కులను కొన్నాడు. క్రిష్ తన చిత్రానికి కొండపోలం పేరు పెట్టాలని నిర్ణ‌యించుకున్నా ఎందుక‌నో ఇంకా స‌స్పెన్స్ మెయింటెయిన్ చేస్తున్నార‌ట‌.

కొండ కోన‌ల్లో విలేజ్ నేప‌థ్యంలో ఆద్యంతం ప‌చ్చ‌ద‌నం న‌డుమ ర‌క్తి క‌ట్టించే చిత్ర‌మిద‌ని ఇందులో పులి పాత్ర ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంద‌ని కూడా చెబుతున్నారు.  రొటీనిటీకి భిన్నంగా అల‌రించే చిత్ర‌మిది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్  విలేజ్ గాళ్ పాత్ర‌లో కనిపిస్తుంది. వైష్ణ‌వ్ తేజ్ ప‌ల్లె యువ‌కుడిగా క‌నిపిస్తార‌ట‌. ప్రస్తుతానికి మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జోరందుకుంది. సాధ్య‌మైనంత తొంద‌ర‌లోనే మూవీని రిలీజ్ చేయ‌న‌న్నారు.
Tags:    

Similar News