‘శాతకర్ణి’ నుంచి దేవి ఎందుకు తప్పుకున్నాడంటే..

Update: 2017-03-28 10:25 GMT
నందమూరి బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి ముందు సంగీత దర్శకుడిగా అనుకున్నది దేవిశ్రీ ప్రసాద్ ను. కానీ అనూహ్యంగా అతను ఆ ప్రాజెక్టు నుంచి బయటికి వెళ్లిపోయాడు. క్రిష్ తో ‘కంచె’కు పని చేసిన చిరంతన్ ప్రాజెక్టు ఈ చిత్ర సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. ఐతే దేవిశ్రీ ఎందుకు ఈ సినిమా నుంచి బయటికవ వెళ్లాల్సి వచ్చిందో ఎవరికీ తెలియదు. ఆ సమయంలో దీనిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఐతే దీనికి అసలు కారణం ఏంటన్నది క్రిష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

దేవిశ్రీ ‘శాతకర్ణి’ నుంచి తప్పుకోవడంలో తప్పంతా తనదే అంటున్నాడు క్రిష్. ఈ సినిమాను చాలా వేగంగా పూర్తి చేయాల్సిన నేపథ్యంలో తనకు చాలినంత సమయం లేకపోవడం వల్లే దేవిశ్రీతో పని చేయించుకునేందుకు అవకాశం లేకపోయిందని క్రిష్ తెలిపాడు. దేవిశ్రీ చెన్నైలో ఉండే పని చేస్తాడని.. ఐతే తాను టైట్ షెడ్యూళ్ల మధ్య పని చేయాల్సి ఉండటంతో తరచుగా చెన్నై వెళ్లి రావడం కుదరదని భావించి.. పైగా దేవిశ్రీ కూడా వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడని.. అందుకే అన్నీ చూసుకుని దేవిశ్రీకి నో చెప్పినట్లు క్రిష్ వెల్లడించాడు.

చిరంతన్ అప్పటికే తనతో ‘కంచె’కు పని చేసి ఉండటంతో అతను తాను కోరుకున్న సమయానికి కోరకున్న ఔట్ పుట్ ఇవ్వగలడని నమ్మానని.. చిరంతన్ తన నమ్మకాన్ని నిలబెట్టాడని.. ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్నందించాడని క్రిష్ చెప్పాడు. ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా కుదిరిందని.. సిరివెన్నెల సీతారామశాస్త్రి తన సాహిత్యంతో పాటలకు ప్రాణం పోశారని అన్నాడు క్రిష్.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News