• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వెబ్ సిరీసుల మీద పడ్డ...

వెబ్ సిరీసుల మీద పడ్డ స్టార్ డైరెక్టర్

By - Tupaki Desk
Update: 2020-04-02 22:30 GMT
'గమ్యం' సినిమా ద్వారా తన కంటూ ఒక గమ్యాన్ని ఏర్పరుచుకున్న దర్శకుడు క్రిష్. ఫస్ట్ సినిమా తోనే మంచి దర్శకుడిగా సినీ విమర్శకుల మన్ననలు పొందాడు. ఆ తర్వాత కృష్ణం వందే జగద్గురుమ్, వేదం చిత్రాల తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'కంచె' సినిమా ద్వారా ఎన్నో అవార్డులను రివార్డులను సొంతం చేసుకున్నాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా తో స్టార్ డైరెక్టరుగా పేరు తెచ్చుకున్నారు. తర్వాత తీసిన ఎన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కిన 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఎన్టీఆర్ మహానాయకుడు' చిత్రాల పరాజయం చెందడం తో తన ఇమేజ్ కొంచెం డామేజ్ అయిందనే చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 27వ చిత్రాన్ని లైన్ లో పెట్టాడు. ఈ చిత్రానికి ఏ.ఎమ్. రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా పూర్తయ్యాక ఈ సినిమా పట్టాలెక్కనున్నది.

ఈ గ్యాప్ లో ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' కోసం కొన్ని వెబ్ సిరీస్ లు రూపొందిస్తున్నారు. అందులో ఒక‌టి స్ట్రీమింగ్ కూడా అవుతోంది. అంతేకాకుండా మూడు నాలుగు వెబ్ సిరీస్‌లు రూపొందించే బాధ్య‌త‌ని క్రిష్ మీద వేశారట అల్లు అర‌వింద్‌. ఇప్పటికే పలు సీరియళ్లు, టీవీ యాడ్స్ తీసిన అనుభవం ఉన్న క్రిష్ ఇప్పుడు తాజాగా ఓటీటీ హాట్ స్టార్ కి కూడా ఒక వెబ్ సిరీస్ నిర్మించి ఇచ్చే పనిలో పడ్డాడట. ఈ మేర‌కు హాట్ స్టార్‌తో ఒప్పందం కూడా కుదిరిందని సమాచారం. ఈ వెబ్ సిరీస్‌కి క్రిష్ క‌థ‌, స్క్రీన్ ప్లే అందించడం తో పాటు నిర్మాణంలోనూ పాలు పంచుకుంటున్నారట. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్ లో ఉన్న ఈ వెబ్ సిరీస్‌లో కొంత‌మంది టాలీవుడ్ స్టార్లు కూడా క‌నిపిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వెబ్ సిరీస్ ల‌లో బోల్డ్ కంటెంట్‌దే పైచేయి, మరి దీన్ని క్రిష్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. హాట్ స్టార్ కోసం మ‌రి క్రిష్ ఎలాంటి క‌థ‌ని చెప్ప‌బోతున్నాడో చూడాలి.
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • krish 
  • web series 
  • hot star 
  • OTT 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS