ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 3 కూడా ఉందా?
ఎన్టీఆర్ బయోపిక్ మొదట ఒక సినిమాగానే అనుకున్నారు. కానీ క్రిష్ అండ్ టీమ్ అనుకున్న కథ ప్రకారం అన్నీ ముఖ్యమైన సీన్లు కవర్ చేయాలంటే ఫుటేజ్ ఎంత కుదించినా 4.30 గంటలు ఉంటుందని ఒక అంచనాకు వచ్చారు. దీంతో ఒక భాగం అనుకున్నది కాస్తా 'కథానాయకుడు'.. 'మహానాయకుడు' గా రెండు భాగాలుగా మారింది. అయినా ఈ సినిమాలో లక్ష్మి పార్వతి ఎపిసోడ్ ఉండదు. దీంతో మేకర్స్ పై విమర్శలు కూడా వస్తున్నాయి.
ఈమధ్య ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో వైసీపీ లీడర్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ ఖాతా ద్వారా పదునైన విమర్శలు చేశారు. ఎల్లో మీడియా కలెక్షన్స్ విషయంలో పెద్ద హంగామా చేస్తోందిగానీ సోషల్ మీడియాలో టికెట్లను ఫ్రీగా పంచుతున్న వైరల్ వీడియోలను జనాలు చూస్తున్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వారే ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించడం గాడ్సే కోణం లో మహాత్మా గాంధి బయోపిక్ తెరకెక్కించిన చందంగా ఉందన్నారు. ఎలెక్షన్ కు ముందు వోటర్లను ప్రభావితం చేసేందుకే ఈ బయోపిక్ ను ముందుకు తీసుకొచ్చారని ఆరోపించారు.
ఈ విమర్శలపై దర్శకుడు క్రిష్ స్పందిస్తూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను ఖండించాడు. రాజకీయనాయకులు ప్రతి విషయంలో కులం... రాజకీయ కోణంలో చూడడం మానుకోవాలని చెప్తూ ఎన్టీఆర్ గొప్పదనాన్ని చూపాలని ప్రయత్నం చేశామని ఇందులో ఎలాంటి పొలిటికల్ బెనిఫిట్ చూసుకోలేదని వెల్లడించాడు. మరి ఎన్టీఆర్ జీవితంలోని వివాదాస్పద ఘట్టాలను చూపించడం లేదు కదా అని అడిగితే.. ఒకవేళ మూడో భాగం కనుక తెరకెక్కిస్తే అవి కూడా కవర్ చేస్తామన్నాడు. క్రిష్ మూడో భాగం గురించి మాట్లాడాడు సరే గానీ తెరకెక్కించడానికి బాలయ్య ఒప్పుకుంటాడో లేదో. ఒకవేళ మూడో భాగం తెరకెక్కితే 'క్రిష్ ఎన్టీఆర్' అని టైటిల్ కరెక్ట్ గా సరిపోతుంది కదా.