మహేష్ అనే ఒక్కడు తప్ప..

Update: 2018-04-23 13:46 GMT
‘రంగస్థలం’ సినిమా అయ్యాక రామ్ చరణ్ తప్ప వేరొకరిని చిట్టిబాబు పాత్రలో ఊహించోలేకపోయానని అన్నాడు దర్శకుడు సుకుమార్. ఇప్పుడు కొరటాల శివ కూడా ఇదే తరహాలో మాట్లాడుతున్నాడు. ‘భరత్ అనే నేను’లో కథానాయకుడి పాత్రను మహేష్ బాబు తప్ప వేరెవ్వరినీ ఊహించుకోలేకపోవడమే కాదు.. ఇంకెవరూ కూడా ఆ పాత్రను అంత బాగా చేసి ఉండేవారు కాదని అతను కితాబిచ్చాడు. మహేష్ బాబు ప్రత్యేకమైన నటుడని.. ఆ ప్రత్యేకతే భరత్ పాత్రను అంత బాగా ఎలివేట్ చేసిందని కొరటాల చెప్పాడు.

‘‘ఎక్కువ మాట్లాడకుండానే ప్రభావం చూపించగల నటుడు భరత్ పాత్రలో కనిపించాలని అనుకున్నా. ఆ నటుడు వాయిస్ పెంచకుండా మాట్లాడాలి. అయినప్పటికీ జనాలు అతడి మాటలు వినేలా ఉండాలి. అనవసర దూకుడు చూపించకుండానే ఇంటెన్సిటీ కనిపించేలా చేయాలి. ఈ లక్షణాలన్నీ ఉన్న నటుడు మహేష్ బాబు మాత్రమే. మహష్ మామూలుగానే తక్కువ మాట్లాడతాడు. కామ్ గా కనిపిస్తాడు. అయినా చాలా ప్రభావం చూపిస్తాడు. నా సినిమాలో ముఖ్యమంత్రి ఎలా ఉంటాడో మామూలుగా కూడా మహేష్ అలాగే ఉంటాడు. అందుకే భరత్ పాత్రలో మహేష్ తప్ప వేరొకరిని ఊహించుకోలేకపోతున్నా’’ అని కొరటాల చెప్పాడు. మామూలుగా తాను సీక్వెల్స్ కు వ్యతిరేకం అయినప్పటికీ ‘భరత్ అనే నేను’ విషయంలో మాత్రం కొనసాగింపుగా ఓ సినిమా చేయాలనిపిస్తోందని కొరటాల చెప్పడం విశేషం.
Tags:    

Similar News