కొరటాల కొత్త ప్రయత్నాలు

Update: 2021-09-18 01:30 GMT
టాలీవుడ్‌ లో టాప్ స్టార్‌ డైరెక్టర్స్ జాబితా తీస్తే అందులో మొదటి వరుసలో ఉండే వ్యక్తి కొరటాల శివ అనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకు అపజయం లేకుండా వరుస విజయాలతో దూసుకు వస్తున్న కొరటాల శివ మెగాస్టార్‌ చిరంజీవితో ఆచార్య సినిమా ను తీసి విడుదలకు సిద్దం చేశాడు. ఆ తర్వాత ఎన్టీఆర్‌30 సినిమా కు కూడా రెడీ అయ్యాడు. అతి త్వరలోనే ఎన్టీఆర్ 30 సినిమా పట్టాలెక్కబోతుంది. వచ్చే ఏడాది సమ్మర్ లోనే ఎన్టీఆర్‌ తో చేస్తున్న సినిమాను విడుదల చేస్తాడని తెలుస్తోంది. ఇక ఆ తర్వాత కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసేందుకు కొరటాల శివ పక్కా ప్లానింగ్‌ తో ఉన్నాడు. పెద్ద ఎత్తున అంచనాలున్న కొరటాల శివ సినిమాలు ప్రతీది కూడా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్‌ విజయాలను దక్కించుకున్న సందర్బాలు ఉన్నాయి. అందుకే కొరటాల సినిమాలు అంటే జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన బ్రాండ్‌ విలువ పెరిగిన నేపథ్యంలో దాన్ని ఉపయోగించుకునేందుకు సిద్దం అయ్యాడు.

ప్రస్తుతం ఓటీటీ టైమ్‌ నడుస్తోంది. చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు అన్నింటికి కూడా ఓటీటీ లో మంచి ఆధరణ ఉంది. అందుకే ఓటీటీ లో తమ సినిమాలను విడుదల చేసేందుకు మేకర్స్ కూడా సిద్దం అవుతున్నారు. ఈ సమయంలోనే కొత్త ఫిల్మ్‌ మేకర్స్ కు కూడా ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ చక్కని అవకాశాలను ఇస్తుంది. తెలుగు లో ఓటీటీ సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లు ఎక్కువ అవుతున్నాయి. స్టార్స్ కూడా ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్న ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ముందు ముందు ఓటీటీ ల జోరు పెరుగుతుందని అంటున్నారు. అందుకే ఓటీటీ సినిమాల మార్కెట్‌ లోకి పెద్ద దర్శకులు మరియు నిర్మాతలు కూడా జాయిన్ అవుతున్నారు. తాజాగా కొరటాల శివ కూడా ఓటీటీ సినిమాల విషయమై దృష్టి పెట్టినట్లుగా సమాచారం అందుతోంది.

తన వద్ద ఉన్న స్టోరీ లైన్స్ తో పాటు కొత్త దర్శకుల వద్ద ఉన్న కథలతో లో బడ్జెట్‌ సినిమాలను ఓటీటీ కోసం నిర్మించాలని భావిస్తున్నాడు. ఒకొక్కటి చొప్పున బ్యాక్ టు బ్యాక్ ఓటీటీ ల ద్వారా సినిమాలను కొరటాల శివ విడుదల చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సొంత నిర్మాణ సంస్థను కొరటాల ఏర్పాటు చేస్తాడా లేదంటే సన్నిహితులతో కలిసి భాగస్వామ్యంలో ఈ వెబ్‌ మూవీస్ ని నిర్మిస్తాడో చూడాలి. మంచి ప్రతిభ ఉన్న వారికి మంచి అవకాశం గా ఇది ఉంటుందని.. అలాగే ప్రేక్షకులకు ఓటీటీ ద్వారా మంచి సినిమాలు కూడా అందుతాయి అంటూ కొరటాల సన్నిహితులు అంటున్నారు. అతి త్వరలోనే కొరటాల నుండి ప్రకటన వస్తుందని అంటున్నారు. బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు ఇప్పటికే ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు. సౌత్ నుండి కూడా మెల్ల మెల్లగా స్టార్స్ ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో కొరటాల శివ ముందడుగు చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
Tags:    

Similar News