ఓ పిట్టకథే కానీ చాలా పెద్ద కథ: కొరటాల
ప్రముఖ టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'ఓ పిట్ట కథ'. ఈ సినిమాకు క్యాప్షన్ 'ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ'. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాతో చందు ముద్దు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను స్టార్ డైరెక్టర్ల తో విడుదల చేయిస్తూ సినిమా కు హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు 'ఓ పిట్ట కథ' టీమ్.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను జనవరి 26 న త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కొరటాల శివ విడుదల చేయడం విశేషం. ఈ ఫస్ట్ లుక్ లాంచ్ సందర్భం గా కొరటాల మాట్లాడుతూ "ఇది ఓ పిట్టకథే కానీ చాలా పెద్ద కథ అని నేను నమ్ముతున్నాను. కాసేపటి క్రితమే టీజర్ ను కూడా చూశాను. పెద్ద వంశీగారి సినిమా లాగా అందంగా.. పాజిటివ్ గా అనిపించింది. 'ఓ పిట్ట కథ' టీమ్ అందరికీ అల్ ది బెస్ట్" అన్నారు.
Full View
ఇదిలా ఉంటే 'ఓ పిట్టకథ' టీజర్ ను త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేస్తారని సమాచారం. ఈ సినిమాలో నిత్య శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. విశ్వాంత్.. బ్రహ్మాజీ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ సినిమాతో సంజయ్ ప్రేక్షకులను మెప్పిస్తాడా అనేది వేచి చూడాలి.