• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కొరటాల మాటలు...

కొరటాల మాటలు ఆలోచించాల్సిన విషయమే

By - Tupaki Desk
Update: 2017-08-07 07:19 GMT
సమాజానికి ఓ మంచి సందేశం ఇస్తూనే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్సవకుండా సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడం  డైరెక్టర్ కొరటాల శివ స్పెషాలిటీ. రైటర్ గా మొదలెట్టి డైరెక్టర్ గా టర్న్ అయిన కొరటాల శివ మొదటి సినిమా మిర్చి నుంచి ప్రతి సినిమాలోనూ సొసైటీకి పనికొచ్చే ఏదో ఒక విషయం చెబుతూనే వచ్చాడు.

‘ఊరి నుంచి ఎంతో తీసుకున్నాం. తిరిగి ఇచ్చేయకపోతే లావైపోతాం’ అంటూ శ్రీమంతుడులో మహేష్ బాబుతో చెప్పించిన డైలాగ్ ఎంతో పాపులర్ అయింది. సొంత ఊరికి ఎంతో కొంత మేలు చేసేందుకు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. కొరటాల శివ లేటెస్ట్ గా తీసిన జనతా గ్యారేజ్ సినిమా మొత్తం పర్యావరణ పరిరక్షణ చుట్టూ సాగుతోంది. మొక్కలు కాపాడుకోవాలనే సందేశాన్ని ఈ సినిమాలో బలంగానే వినిపించాడు. రీసెంట్ గా కొరటాల శివ రాజకీయాలపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో పంచుకున్నాడు. ‘రాజకీయాలు రానురాను దారుణాతిదారుణంగా దిగజారిపోతున్నాయి. ఇంతకుముందెన్నడూ లేనంత స్థాయిలో. దేవుడు కూడా దీని నుంచి కాపాడలేడు. మనం కాపాడుకోగలం.. మనం మాత్రమే కాపాడుకోగలం’ అంటూ బలమైన సందేశాన్ని వినిపించాడు.

రాజకీయ పరిస్థితులను చూసి ఆవేదన చెంది సరిపెట్టుకోకుండా పదిమందిలో ఆలోచన పెంచేలా కొరటాల శివ పెట్టిన ట్వీట్ అభిమానులను బాగానే ఆకట్టుకుంటోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగేది ప్రజలేనన్న నిజం అందరూ గుర్తెరగాలన్న ఆవేదన కొరటాల మాటల్లో కనిపిస్తోంది.  మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం కొరటాల శివ తీస్తున్న భరత్ అనే నేను సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కుతున్నదే కావడం విశేషం. బాలీవుడ్ భామ కియారీ అద్వానీ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.

Tags:    
  • Koratala Siva 
  • Present Politics 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS