కూర‌గాయ‌ల కోసం వచ్చిన‌ట్టే థియేట‌ర్ల‌కు వ‌స్తారు!- కొర‌టాల‌

Update: 2020-08-27 23:30 GMT
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా కొర‌టాల శివ తెర‌కెక్కించ‌నున్న `ఆచార్య` క‌థాంశం కాపీ క‌థాంశ‌మ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. వేరే స్టార్ హీరో కోసం రెడీ చేసిన క‌థ‌ను కొట్టేశార‌ని ఆరోపిస్తూ ఓ ర‌చ‌యిత‌ మీడియాలో హీటెక్కించిన నేప‌థ్యంలో మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ఆ వార్త‌ల్ని ఖండించింది. ఇది సొంతంగా రాసుకున్న క‌థాంశ‌మ‌ని నిర్మాత‌లు వెల్ల‌డించారు.

ఇక ఓ టీవీ చానెల్ లైవ్ లోకి వ‌చ్చిన కొర‌టాల ఆచార్య‌ త‌న సొంత క‌థ అని తెలిపారు. అంతేకాదు.. యాంక‌ర్ అడిగిన ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలిచ్చారు. ప్ర‌స్తుత క్రైసిస్ కార‌ణంగా ఓటీటీ వెల్లువ‌లో థియేట‌ర్ల‌కు జ‌నం వ‌చ్చే అవ‌కాశం ఉందా? అన్న ప్ర‌శ్న‌కు కొర‌టాల ఆస‌క్తిక‌ర స‌మాధాన‌మిచ్చారు.

ప్ర‌స్తుతం కొంత‌వ‌ర‌కూ భ‌యం ఉంది. కానీ మ‌హ‌మ్మారీ త‌గ్గిపోయింది అన్న సంకేతం అంద‌గానే ప్ర‌జ‌లు య‌థావిధిగా థియేట‌ర్ల‌కు వ‌స్తార‌ని కొర‌టాల అన్నారు. మూడు నాలుగు నెల‌ల త‌ర్వాత ప‌రిస్థితి మారిపోతుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. జ‌నం కూర‌గాయ‌ల కోసం ఇత‌ర సరుకుల కోసం బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ట్టే థియేట‌ర్ల‌కు వ‌స్తారు. అయితే భ‌యం తగ్గిపోవాల‌ని కొర‌టాల అన్నారు. థియేట‌ర్ ఎక్స్ పీరియెన్స్ ఎక్క‌డా రాదు. దానిని ప్ర‌జ‌లు ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా ఫీల‌వుతారు. అందుకే ఓటీటీలు ఉన్నా థియేట‌ర్ కి వ‌చ్చి చూసేందుకు ప్ర‌జ‌లు ఇష్ట‌ప‌డ‌తార‌ని అన్నారు. ఇక ఆచార్య క‌థానాయ‌కుడు చిరంజీవి సైతం కొంత‌కాలానికి ఇవ‌న్నీ స‌మ‌సిపోయి థియేట‌ర్ వ్య‌వ‌స్థ మెరుగ‌వుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News