• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'కొండ పొలం' సెన్సార్...

'కొండ పొలం' సెన్సార్ పూర్తి..!

By - Tupaki Desk
Update: 2021-10-01 06:50 GMT
పంజా వైష్ణవ్‌ తేజ్‌ - రకుల్ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ''కొండ పొలం''. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజీవ్‌ రెడ్డి - జె. సాయి బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది అటవీ నేపథ్యంలో సాగే అడ్వెంచర్ మూవీ. అక్టోబరు 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుసుకురానున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు.

'కొండ పొలం' చిత్రానికి సెన్సార్ బోర్డ్ వారు క్లీన్ 'యూ' (U) సర్టిఫికేట్ జారీ చేసినట్లు దర్శకనిర్మాతలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన పోస్టర్ ని వదిలారు. ఇందులో వైష్ణవ్ తేజ్ గొర్రెల కాపరి గెటప్ లో భుజం మీద కంబలి.. చేతిలో కర్ర పట్టుకుని నిలబడి ఉన్నాడు. బ్యాగ్రౌండ్ లో ఓ సింహం కనిపిస్తోంది. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ - 'ఓబులమ్మ' 'శ్వాసలో' పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది.

ట్రైలర్ ని బట్టి చూస్తే 'కొండ పొలం' లో ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ చిత్రానికి 'యూ' సర్టిఫికెట్ రావడంతో, క్రిష్ ఇందులో యాక్టన్ ని కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసినట్లు అర్థం అవుతోంది. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన 'కొండ పొలం' నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. బిబో శ్రీనివాస్ సమర్పిస్తున్న ఈ మూవీ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోంది.

ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ అందించగా.. రాజ్ కుమార్ గిబ్సన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. శ్రవణ్ కటికనేని దీనికి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి చంద్ - కోట శ్రీనివాసరావు - నాజర్ - అన్నపూర్ణ - హేమ - ఆంథోనీ - రవి ప్రకాష్ - రచ్చ రవి - మహేష్ విట్టా - ఆనంద్ విహారి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. 'ఉప్పెన' వంటి సూపర్ హిట్ తర్వాత వైష్ణవ్ తేజ్ నుంచి వస్తున్న ''కొండ పొలం'' సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Tags:    
  • kondapolam 
  • kondapolam release date 
  • kondapolam censor 
  • kondapolam rakul preet singh 
  • kondapolam trailer 

Similar News

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

Copyright @2026

Powered by Blink CMS