• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కోన సార్.. మరి ఆ కేసు...

కోన సార్.. మరి ఆ కేసు సంగతేంటి?

By - Tupaki Desk
Update: 2018-04-06 09:36 GMT
సల్మాన్ ఖాన్ కు ఏమైనా అయితే చాలు.. బాలీవుడ్ జనాలు తల్లడిల్లిపోతారు. అప్పుడు వాళ్లకు చట్టాలు.. న్యాయ అన్యాయాలు ఏమీ గుర్తుకు రావు. కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ ను దోషిగా ప్రకటిస్తూ అతడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో బాలీవుడ్ జనాల బాధ మామూలుగా లేదు. ఐతే వాళ్లు మాత్రమేనా టాలీవుడ్ నుంచి సీనియర్ రైటర్ కోన వెంకట్ సైతం సల్మాన్ కు శిక్ష పడ్డ నేపథ్యంలో తన ఆవేదనను ట్విట్టర్లో వ్యక్తం చేశాడు. జంతువుల సంగతి తర్వాత ముందు మనుషుల్ని కాపాడాలి అంటూ ఆయన ట్వీట్ చేశాడు. తాను జంతువుల్ని వేటాడటానికి వ్యతిరేకమే అని.. కానీ అదే సమయంలో మనుషులు మరింత ముఖ్యమని.. సల్మాన్ విషయంలో తనకు చాలా ఆందోళనగా ఉందని అన్నాడు కోన.

ఐతే కృష్ణ జింకల కేసు సంగతి వదిలేద్దాం. సల్మాన్ తాగి కారు నడిపి ఒకరి మరణానికి.. ముగ్గురు తీవ్ర గాయాలు పాలు కావడానికి కారణమైన కేసు సంగతేంటి? అప్పుడు చనిపోయింది.. గాయపడింది మనుషులేగా? ఈ కేసుకు సంబంధించి సాక్ష్యం చెప్పిన పాపానికి ఒక పోలీసు జీవితమూ అన్యాయమైపోయింది. ఈ కేసు నీరుగారిపోయి ఉండొచ్చు. సల్మాన్ బెయిల్ మీద బయటికి వచ్చి దర్జాగా తిరిగేస్తుండొచ్చు. కోర్టు తీర్పుల గురించి వ్యాఖ్యానాలు చేయలేం సరే.. ఆ కేసులో సాక్ష్యాలన్నీ సల్మాన్ కు వ్యతిరేకుంగా ఉన్న మాట వాస్తవం కాదా? మరి ఆ కేసుకు సంబంధించి శిక్ష పడ్డపుడు కూడా ఈ జనాలు ఇలాగే స్పందించారు. సల్మాన్ కు ఏమన్నా అయితే జాతికే నష్టం అన్నట్లు మాట్లాడారు. సల్మాన్ జైలుకెళ్తే అన్ని వందల కోట్లు నష్టం.. ఇన్ని వందల కోట్లు నష్టం అని అన్నారు. అయినా చట్ట ప్రకారం ఏ నేరానికి ఎంత శిక్ష అనేది ఉంటుంది. చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే. ఆ తప్పుకు తగ్గ శిక్ష పడాల్సిందే. ఇప్పుడు జింకల్ని చంపితే ఐదేళ్లు శిక్షా అంటున్న వాళ్లు.. నాడు హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి ఐదుగురి జీవితాలు నాశనమయ్యాయి. వాళ్ల విషయంలో ఎవరైనా బాధ పడ్డారా? అయ్యో అన్నారా? ఇప్పుడు సల్మాన్ గురించి ఫీలవుతున్న కోన అయినా వాళ్ల గురించి స్పందించాడా?
Tags:    
  • Kona Venkat 
  • Salman Khan 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS