• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  13 ఏళ్ల తర్వాత కోన...

13 ఏళ్ల తర్వాత కోన వారిద్దరిని కలిపాడు

By - Tupaki Desk
Update: 2018-11-08 15:30 GMT
టాలీవుడ్‌ ప్రముఖ రచయిత కోన వెంకట్‌ ఈమద్య కాస్త సక్సెస్‌ ల విషయంలో వెనుకపడి పోయాడు. ఈయన అందించిన కథలు పాత చింతకాయ పచ్చడిలా ఉంటున్నాయని - డైలాగ్స్‌ కూడా ఈతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉండటం లేదు అంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. దాంతో రచయితగా కాస్త తగ్గించి - ప్రొడక్షన్‌ పనులు మొదలు పెట్టాడు. కోన ఫిలిం కార్పోరేషన్‌ పేరుతో పలు చిత్రాలను నిర్మించిన ఈయన ప్రస్తుతం నాగచైతన్య - సమంతలు నటిస్తున్న సినిమాకు కూడా నిర్మాతగానో సమర్పకుడిగానో వ్యవహరించబోతున్నట్లుగా తెలుస్తోంది.

చిన్న దర్శకుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్న కోన వెంకట్‌ త్వరలో మరో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఆ చిత్రంలో అనుష్క మరియు మాధవన్‌ కలిసి నటించబోతున్నారు. అనుష్క కెరీర్‌ ఆరంభంలో అంటే దాదాపు 13 ఏళ్ల క్రితం మాధవన్‌ తో కలిసి ‘రెండు’ అనే తమిళ చిత్రంలో నటించింది. ఆ చిత్రం తర్వాత మళ్లీ ఇప్పటి వరకు మాధవన్‌ - అనుష్కలు కలిసి నటించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు కోనా వారిద్దరిని కలిపాడు. విభిన్నమైన ప్రేమ కథతో ఈ చిత్రాన్ని హేమంత్‌ మధుకర్‌ తెరకెక్కించబోతున్నాడట.

హేమంత్‌ మధుకర్‌ ఎనిమిది సంవత్సరాల క్రితం మంచు హీరో విష్ణుతో ‘వస్తాడు నా రాజు’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో హేమంత్‌ ఆఫ్‌ ది స్క్రీన్‌ వెళ్లి పోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు కోన సహకారంతో అనుష్క - మాధవన్‌ లతో సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని ఫీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ లో నిర్మించబోతున్నారు. కోన వెంకట్‌ సమర్పకుడిగా వ్యవహరించబోతున్నాడట. అనుష్క బర్త్‌ డే సందర్బంగా కోన ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఈ చిత్రం మెజార్టీ షూటింగ్‌ అమెరికాలో జరుపబోతున్నారట. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను సెట్స్‌ పైకి తీసుకు వెళ్లి, అదే వచ్చే ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.
Tags:    
  • Kona Venkat 
  • Madhavan 
  • Anushka 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS