• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'గల్లీ రౌడీ' హిట్ కొట్టడం...

'గల్లీ రౌడీ' హిట్ కొట్టడం ఖాయం .. ఎందుకంటే ఆ సెంటిమెంట్ ఉంది: కోన వెంకట్

By - Tupaki Desk
Update: 2021-09-16 05:30 GMT
తెలుగు చిత్రపరిశ్రమలో కోన వెంకట్ కి మంచి పేరు ఉంది. కథా రచయితగా ... సంభాషణల రచయితగా ఆయనకి మంచి క్రేజ్ ఉంది. అలా ఆయన పనిచేసిన సినిమాలు భారీ విజయాలను సాధించాయి. ఇక నిర్మాతగా కూడా ఆయన వరుస విజయాలను అందుకుంటూ వెళుతున్నారు. ఎంవీవీ సత్యనారాయణతో కలిసి ఆయన నిర్మించిన సినిమనే 'గల్లీ రౌడీ'. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ సందర్బంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమాను గురించి కోన వెంకట్ మాట్లాడారు.

"ఎవరు ఎన్ని చెప్పినా సినిమాను గురించి మాట్లాడవలసింది సినిమానే.  అందువల్లనే నేను సినిమాను గురించి తరువాత మాట్లాడతాను. ఈ సినిమా పోస్టర్లపై ఒక 'ఢీ' .. ఒక 'రెడీ' .. ఒక 'దూకుడు' అని ఎందుకు పెట్టామంటే, ఆ కోవలోకి ఈ  సినిమా చెందుతుంది అనేది చెప్పడం నా ఉద్దేశం. ఈ సినిమాకి సంబంధించి నాకు బలమైన సెంటిమెంటు ఒకటి ఉంది. కథారచయితగా .. స్క్రీన్ ప్లే రచయితగా .. డైలాగ్ రైటర్ గా నేను ఫస్టు టైమ్ ఏ హీరోతో పనిచేసినా, ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

ఫస్టు టైమ్ విష్ణుతో 'ఢీ' అనే సినిమాను చేశాను .. అది బ్లాక్ బస్టర్ అయింది. ఫస్టు టైమ్ రామ్ తో 'రెడీ' చేశాను .. ఫస్టు టైమ్ ఎన్టీఆర్ తో 'అదుర్స్' చేశాను .. ఫస్టు టైమ్ మహేశ్ బాబుతో 'దూకుడు' చేశాను. ఆ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాయి. ఆ సెంటిమెంట్ 'గల్లీ రౌడీ'కి వర్తిస్తుంది.  ఎందుకంటే సందీప్ కిషన్ తో నేను ఫస్టు టైమ్ చేస్తున్న సినిమా ఇది. సందీప్ కిషన్ ఎక్కడా కూడా నటిస్తున్నట్టుగా కనిపించడు. కాలనీలో కుర్రాడిలా కనిపిస్తూ, సినిమా .. సినిమాకి తన గ్రాఫ్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు. ఈ సినిమా ఆయన గ్రాఫ్ ను మరింత పెంచే సినిమా అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.  

 ఈ సినిమాకి మాకు ఇంతటి ఊపు .. ఊతం .. ఎంకరేజ్ మెంట్ ఇచ్చింది చిరంజీవి గారు. మా కోసం ఆయన చాలా సమయాన్ని కేటాయించారు. ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించి .. పేమతో పలకరించి ... కాఫీ ఇచ్చి మరీ పంపించారు. ఇండస్ట్రీలో 'అన్నా' అంటే 'నేనున్నా' అనే వ్యక్తి చిరంజీవిగారే. మనస్ఫూర్తిగా ఆయనకి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇక మీరంతా కూడా మీ పనులను పక్కన పెట్టి, మా సినిమా కోసం ఇక్కడికి వచ్చారు. మీరంతా నా బలం ... నా ధైర్యం .. నా సైన్యం. మీ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను" అంటూ ముగించారు.        
Tags:    
  • kona venkat 
  • kona venkat movie 
  • Writer kona venkat 
  • Tollywood Star Writer kona venkat 
  • gully rowdy 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS