మహేష్-రాజమౌళి సినిమాపై నిర్మాత క్లారిటీ
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి తీయబోయే సినిమాలో కథానాయకుడు సూపర్ స్టార్ మహేష్ బాబే అన్న సంగతి తెలిసిందే. ఈ సంగతి ఎప్పుడో ఖరారైంంది. ఐతే ఈ కలల కాంబినేషన్లో సినిమా ఎఫ్పుడు మొదలవుతుందన్నదే తెలియడం లేదు. ఇదిలా ఉంటే.. ఆలూ లేదు చూలూ లేదు అన్న సామెత తరహాలో ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియకుండానే దీని కథ గురించి సామాజిక మాధ్యమాల్లో రకరకాల ప్రచారాలు సాగిపోతున్నాయి. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఒక రస్టిక్ స్టోరీని మహేష్ కోసం జక్కన్న రెడీ చేసినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఐతే మహేష్-రాజమౌళి కాంబినేషన్లో రానున్న సినిమాను నిర్మించనున్న సీనియర్ ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ.. ఈ ప్రాజెక్టు గురించి కొంచెం స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
తనతో సినిమా చేస్తానని ఏడేళ్ల కిందట రాజమౌళి మాటిచ్చారని.. ఐతే ‘బాహుబలి’ రెండు భాగాలుగా తీయాలనుకోవడం, ‘ఆర్ఆర్ఆర్’ సైతం ఆలస్యం కావడంతో తనతో చేయాల్సిన సినిమా పట్టాలెక్కడంలో ఆలస్యం జరిగిందని నారాయణ తెలిపారు. రాజమౌళి తనకు మాటిచ్చినపుడే మహేష్ బాబు హీరో అన్న విషయం ఖరారైందని ఆయనన్నారు. తమ చిత్రాన్ని ఈ ఏడాదే మొదలుపెట్టాలనుకున్నామని.. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ‘ఆర్ఆర్ఆర్’ మరింత ఆలస్యమయ్యేలా ఉండటంతో వచ్చే ఏడాదే తమ సినిమా పట్టాలెక్కొచ్చని నారాయణ తెలిపారు. ఈ సినిమాకు కథ అంటూ ఇంకా ఏమీ ఖరారవ్వలేదని.. రాజమౌళి కొంత మేర వర్క్ చేశారని.. కానీ కథ సహా సినిమాకు సంబంధించి మిగతా విషయాలేవీ ఖరారవ్వలేదని.. ఇప్పటిదాకా కథ ఏంటో తనకు కూడా తెలియదని, అలాంటపుడు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎంత వరకు నిజముందో అర్థం చేసుకోవచ్చని నారాయణ స్పష్టం చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ చేస్తూ మహేష్‌తో చేయాల్సిన సినిమా గురించి రాజమౌళి ఆలోచిస్తారని తాను అనుకోవడం లేదని, ఆ చిత్రం విడుదల తర్వాతే తమ సినిమాపై ఫోకస్ ఉంటుందని ఆయనన్నారు. ఈ చిత్రం ఎప్పుడు మొదలైతే అప్పుడు తాను అందుబాటులో ఉంటానని, కాస్త ముందు చెప్పాలని మహేష్ ఎఫ్పుడో చెప్పాడని నారాయణ వెల్లడించారు.