• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జోరుమీదున్న కిరణ్...

జోరుమీదున్న కిరణ్ అబ్బవరం.. మైత్రీ బ్యానర్ లో కొత్త సినిమా..!

By - Tupaki Desk
Update: 2021-11-29 16:30 GMT
'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా పరిచయమైన యువ నటుడు కిరణ్ అబ్బవరం.. వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. ఇటీవలే 'ఎస్ఆర్ కల్యాణమండపం' కమర్షియల్ సక్సెస్ అందుకున్న కిరణ్.. ప్రస్తుతం 'సమ్మతమే' 'సెబాస్టియన్' సినిమాలతో పాటుగా మరో సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించాడు.

ప్రముఖ దర్శకులు కేఎస్ రవీంద్ర (బాబీ) - గోపీచంద్ మలినేనిల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన రమేష్ కాదూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవల కాలంలో స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తున్న అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ మరియు క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నవీన్ యెర్నేని - రవిశంకర్ యలమంచిలి సమర్పిస్తున్న ఈ సినిమాకి చిరంజీవి (చెర్రీ) - హేమలత పెదమల్లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈరోజు సోమవారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభించారు. ఫస్ట్ షాట్ కు డైరెక్టర్ కేఎస్ రవీంద్ర కెమెరా స్విచ్చాన్ చేయగా.. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ క్లాప్ కొట్టారు. మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని - రవిశంకర్ - చెర్రీ స్క్రిప్ట్ ను దర్శకుడికి అందజేశారు.

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ఈ మాస్ సినిమాకి స్క్రీన్ ప్లే - డైలాగ్స్ దర్శకుడు రమేష్ కడూరి అందిస్తున్నారు. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రాఫర్ గా.. జెవి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు. విలక్షణమైన కథలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్న కిరణ్.. ఈసారి మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో చేస్తుండటం అతని కెరీర్ కు ప్లస్ అనే చెప్పాలి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Tags:    
  • Kiran Abbavaram 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS