• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కళ్లు చెమర్చేలా యంగ్ హీరో...

కళ్లు చెమర్చేలా యంగ్ హీరో ఎమోషనల్‌ పోస్ట్‌

By - Tupaki Desk
Update: 2021-12-03 13:30 GMT
యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం సోదరుడు రామానుజులు రెడ్డి అబ్బవరం ఇటీవలే రోడ్డు యాక్సిడెంట్‌ లో తుది శ్వాస విడిచిన విషయం తెల్సిందే. కడప జిల్లా సొంత ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. సోదరుడి మృతితో కిరణ్ అబ్బవరం కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగి పోయారు. కిరణ్ అబ్బవరంకు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు మరియు అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా సానుభూతి తెలియజేసి ఆయన సోదరుడి మృతికి సంతాపం తెలియజేశారు. రామానుజులు రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలంటూ ఎంతో మంది సోషల్‌ మీడియా ద్వారా తమ శ్రద్దాంజలి ఘటించారు. సోషల్ మీడియా ద్వారా కిరణ్ అబ్బవరం కూడా ఫీల్ ను షేర్ చేసుకుని కన్నీరు తెప్పించాడు.

ఇన్ స్టా లో సోదరుడిని ఉద్దేశించి కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ... రేయ్‌ కిర మన ఊరికి రోడ్డులు కూడా లేవు.. మనలో ఎవరో ఒకరు ఏదో ఒకటి గట్టిగా సాధించాలిరా అంటూ తనకు సాధ్యం అయిన దాని కంటే కూడా అధికంగా సపోర్ట్‌ చేశాడు. తన లగ్జరీ ని త్యాగం చేసి నా కోసం చాలా త్యాగాలు చేసిన తన వల్ల ఇప్పుడిప్పుడే ఏదో సాధిస్తున్న నేపథ్యంలో అతడు మన మద్య లేకుండా పోయాడు అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు. ఇంకా తను ఎప్పుడు అడిగేవాడు.. ఎప్పుడు నన్ను పరిచయం చేస్తావురా అని.. గట్టిగా సాధించిన తర్వాత పరిచయం చేస్తాను అని చెప్పేవాడిని.. ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. నా వెనుక ఉన్నది నా సోదరుడు అబ్బవరం రామానుజులు రెడ్డి. .. అతడి వల్లే తాను ఈ స్థాయికి వచ్చాను. కాని పరిచయం చేయకుండానే ఇలా జరగడం బాధగా ఉందంటూ హీరో చెప్పుకొచ్చాడు.

హీరోగా రాజా వారు రాణి గారు సినిమా తో పరిచయం అయిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆసినిమా పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం సమ్మతమే అనే ప్రాజెక్ట్‌ చేస్తున్న కిరణ్ అబ్బవరం ఇంట ఇలాంటి విషాదం జరగడం ఇండస్ట్రీ వర్గాల వారికి కన్నీరు తెప్పిస్తుంది. సోషల్‌ మీడియాలో కిరణ్ షేర్ చేసిన ఈ పోస్ట్‌ కూడా ప్రతి ఒక్కరికి కళ్లు చెమర్చేలా చేసింది. కిరణ్‌ అబ్బవరం సోదరుడిని ఇలా పరిచయం చేయాల్సి రావడం దారుణం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.
Tags:    
  • SR Kalyanamandapam 
  • kiran Abbavaram 
  • kiran Abbavaram post 
  • kiran Abbavaram instagrampost 
  • kiran Abbavaram brother 
  • kiran Abbavaram image 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS