• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మా అన్నయ్య పడిన కష్టానికి...

మా అన్నయ్య పడిన కష్టానికి ప్రతిఫలమే 'సెబాస్టియన్'

By - Tupaki Desk
Update: 2022-02-05 05:30 GMT
టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో పరిచయమైన యువ కథానాయకులలో కిరణ్ అబ్బవరం ఒకరు. 'రాజావారు రాణిగారు' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన కిరణ్ అబ్బవరం చాలా తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'ఎస్. ఆర్. కల్యాణ మంటపం' సినిమాతో సక్సెస్ ను అందుకున్న కిరణ్ అబ్బవరం. ఆ తరువాత మూడు  ప్రాజెక్టులను పట్టాలెక్కించాడు. ఆ సినిమాలలో 'సెబాస్టియన్ PC 524' ముందుగా రెడీ అయింది. ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు.

తాజా ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ .. "నా కెరియర్ విషయంలో మా అన్నయ్య ఎంతో పట్టుదలతో ఉండేవాడు. 'సెబాస్టియన్' సినిమా ఆగిపోయే పరిస్థితి వస్తే, ఎలాంటి పరిస్థితుల్లో నా సినిమా ఆగిపోకూడదని భావించాడు. అప్పటికి మా అన్నకి ఎంత శాలరీ వస్తుందని కూడా నేను అడగలేదు. ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియదు గానీ, డబ్బు తీసుకొచ్చి పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆయన ఉన్నాడు. ఆ తరువాతనే చనిపోయాడు. తను పడిన కష్టం కోసమైనా ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను.

నా దగ్గరికి వచ్చిన కథల్లో నాకు ఏది బాగా నచ్చితే అది చేసేస్తున్నాను. ఇంతవరకూ పెద్ద దర్శకుల నుంచి నాకు ఎలాంటి అవకాశం రాలేదు. కొంతమంది దర్శకుల దగ్గర మంచి కథలున్నాయని తెలిసినప్పుడు నేనే వెళ్లి వాళ్లను అడుగుతున్నాను కూడా. కాంబినేషన్స్ గురించి నేను ఆలోచించడం లేదు. కథ బాగుంటే చాలు అనే ఉద్దేశంతోనే ముందుకు వెళుతున్నాను. అలా నా సినిమాల ద్వారా కొత్త దర్శకులు పరిచయమవుతున్నారు. అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది.

'సెబాస్టియన్' అనే కథను నేను ఒక 15 నిమిషాలు మాత్రమే విన్నాను. ఈ కథను వినగానే ఓకే చెప్పేశాను. ఇది ఇతర భాషల్లో రిలీజ్ చేయడానికి కూడా స్కోప్ ఉన్న సబ్జెక్ట్. నిర్మాతలు కూడా ఈ కథపై గట్టి నమ్మకంతో ఉన్నారు. అందువలన తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో నా పాత్ర చాలా రోజుల పాటు చాలామందికి గుర్తుండి పోతుంది. రేచీకటి ఉన్న ఓ పాత్రలో 'చంటి'లో బ్రహ్మానందం ఫుల్ ఎంటర్టైన్ చేశారు. అలాంటి రేచీకటి ఉన్న ఈ పాత్ర నాకు ఛాలెంజింగ్ రోల్. ఆడియన్స్ కి కావలసిన నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో దొరుకుతుంది" అని చెప్పుకొచ్చాడు.    
Tags:    
  • Kiran Abbavaram 
  • Kiran Abbavaram movies 
  • Kiran Abbavaram latest Movies 
  • Kiran Abbavaram upcoming movies 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS