కూతురు కోసం కిచ్చా విడాకులు వెనక్కి

Update: 2017-08-26 05:41 GMT
కొందరి సినిమా తారల సంసార జీవితాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత తొందరగా దగ్గర అవుతారో అంతే తొందరగా విడిపోతారు. ఇక ఒక్కసారి విడిపోవాలని నిర్ణయించుకుంటే ఎవ్వరు చెప్పినా వినరు. మీడియాలో ఎన్ని రూమర్లు వచ్చినా పట్టించుకోరు. కనీసం వారికి పుట్టిన పిల్లల కోసం అయినా ఓ క్షణం ఆలోచించారు.  కానీ ఎవరు ఊహించని విధంగా ఓ హీరో తీసుకున్న నిర్ణయం అందరికి షాక్ ని ఇచ్చింది. 2001 లో ఎంతో ప్రేమతో పెళ్లి చేసుకున్న తన భార్య ప్రియతో విడిపోవాలని రెండేళ్ల క్రితం నిర్ణయించుకున్నాడు కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్. ఈ హీరో తెలుగులో రక్త చరిత్ర- ఈగ - బాహుబలి వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

2015లో తన భార్య ప్రియతో విడాకులు కావాలని బెంగుళూర్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో ఎందుకు విడిపోవాలో వివరణ ఇవ్వడానికి కోర్టుకు రావాలని పలుమార్లు న్యాయమూర్తులు వీరిని కోరారు. కానీ వీరు ఎన్నిసార్లు పిలిచినా రాకపోవడంతో కోర్టు చివరిసారిగా వివరణ కోరింది. దీంతో  సుదీప్ తన కుమార్తె సాన్వి జీవితం కోసం భార్యతో జీవితాన్ని కొనసాగించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.  అదే విధంగా ప్రియా కూడా చెప్పడంతో కోర్టులో వారు పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు  ద్వారా తెలిపారు. అందుకు కోర్టు కూడా ఒకే అన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి డైవర్స్ కాకుండా ఆగిపోయినందుకు ఇప్పుడు కిచ్చా సుదీప్ ఫ్యాన్స్ చాలా ఆనందపడుతున్నారు.
Tags:    

Similar News